అగ్ర‌వ‌ర్ణాల‌లోని ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్‌ల‌ను క‌ల్పించే 124వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లును కొద్దిసేప‌టి క్రితం రాజ్య‌సభలో ప్ర‌వేశ‌పెట్టారు.

అగ్ర‌వ‌ర్ణాల‌లోని ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించే 124వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లును కొద్దిసేప‌టి క్రితం రాజ్య‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. కేంద్ర సామాజిక సాధికార‌ శాఖ మంత్రి ధావ‌ర్‌చంద్ గెహ్లాత్ స‌భ‌లో ప్ర‌వేశ‌పెడుతూ ఈ స‌వ‌ర‌ణ ల‌క్ష్యాల‌ను వివ‌రించారు. స‌బ్‌కా సాత్ – స‌బ్ కా వికాస్ నినాదానికి ప‌రిపూర్ణత‌ తెచ్చే ల‌క్ష్యంతో ఈ బిల్లును ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చింద‌ని చెప్పారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోది ఆధ్వ‌ర్యంలో భార‌తీయ జ‌న‌తాపార్టీ తీసుకువ‌చ్చిన ఈ బిల్లు ద్వారా అగ్ర‌వ‌ర్ణాల‌లో ఆర్థికంగా వెనుక‌బ‌డిన వారికి ఉద్యోగాలు, విద్యారంగంలో 10 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. స‌భ‌లో చ‌ర్చ కొన‌సాగుతోంది. మ‌రోవైపు రాజ్య‌స‌భ స‌మావేశాల‌ను పొడిగించాల‌ని తీసుకున్న నిర్ణ‌యంపై విప‌క్షాలు నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశాయి. ఈ అంశంపై త‌మ‌కు ముంద‌స్తు స‌మాచారం లేద‌ని అంటూ వారు స్పీక‌ర్ పోడియంను చుట్టుముట్టారు.