జ‌మ్మూ కాశ్మీర్ లో పూంచ్ జిల్లాలో పాకిస్తాని ద‌ళాలు మ‌రోసారి క‌వ్వింపు లేకుండా కాల్పుల‌కు పాల్ప‌డ్డాయి.

జ‌మ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ లోని స‌రిహ‌ద్దు రేఖ వ‌ద్ద పాకిస్తాని ద‌ళాలు మ‌రోసారి ఎటువంటి క‌వ్వింపు లేకుండానే కాల్పుల నిలిపివేత ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, భారీగా కాల్పుల‌కు పాల్ప‌డ్డాయి. గుల్పూర్ సెక్ష‌న్‌లోని Khari Karmara ప్రాంతంలో ఈ ఉద‌యం 8.30 గంట‌ల‌కు పాకిస్తానీ ద‌ళాలు భార‌త భద్ర‌తా ద‌ళాల పోస్టులు, పౌర ప్రాంతాల‌పై కాల్పులు ప్రారంభించాయ‌ని అధికారులు తెలియ‌జేశారు. ఐతే, అప్ర‌మ‌త్తంగా ఉన్న మ‌న సైనిక ద‌ళాలు పాక్ కాల్పుల‌కు దీటుగా జవాబిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ప్రాణ‌న‌ష్టం , గాయాల గురించిన వార్త‌లు అంద‌లేదు. నిన్న కూడా పాక్ ద‌ళాలు ఎటువంటి కార‌ణం లేకుండానే భార‌త ర‌క్ష‌ణ పోస్టుల‌పై పౌర ప్రాంతాల‌పై కాల్పులు జ‌రిపాయి.