పూణెలో ఈ సాయంత్రం రెండ‌వ Khelo India యువ‌జ‌న క్రీడ‌లు ప్రారంభ‌మ‌వుతాయి.

రెండ‌వ ఖేలో ఇండియా యువ క్రీడ‌లు మ‌హారాష్ర్ట‌లోని పూణెలో ఈ రోజు సాయంత్రం అధికారికంగా ప్రారంభ‌మ‌వుతాయి.  శ్రీ శివ్ ఛ‌త్ర‌ప‌తి క్రీడా మైదానంలో జ‌రిగే ప్రారంభోత్స‌వ కార్య‌క్రమానికి కేంద్ర‌ క్రీడల‌ శాఖ మంత్రి రాజ్య‌వ‌ర్థ‌న్ రాథోర్‌, మ‌హారాష్ర్ట ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌విస్ హాజ‌రుకానున్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈ సంద‌ర్భంగా వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా సందేశం ఇస్తారు. 18 క్రీడా విభాగాల్లో వివిధ రాష్ర్టాల నుంచి 9 వేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. యూత్ ఒలంపిక్ బంగారు ప‌త‌క విజేత, షూట‌ర్ Manu Bhaker, Saurabh Chaudhari, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన‌నున్నారు. ఝార్ఖండ్ రాష్ట్రానికిచెందిన Pratima Kumar, ప‌శ్చిమ‌బెంగాల్‌కు చెందిన షూట‌ర్ అభిన‌వ్ Shaw వంటి కొత్త క్రీడాకారుల‌కు ఒక భారీ tournament లో అడుగిడ‌డం ఇదే మొద‌టిసారి. క్రీడ‌ల్లో భాగ‌మైన యువ‌కుల హాకీ టోర్న‌మెంట్ ముంబ‌యిలో సోమ‌వారం నుండే ప్రారంభ‌మైంది.