మ‌హారాష్ట్రలోని 58 కి.మీ., 4 laneల, Solapur – Tuljapur – Osmanabad జాతీయ ర‌హ‌దారిని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోది జాతికి అంకితం చేశారు.

మ‌హారాష్ట్రలోని 2 వంద‌ల 11వ‌ నెంబ‌రు జాతీయ ర‌హ‌దారిలో షోలాపూర్ – తుల్జాపూర్ – ఉస్మానాబాద్ సెక్ష‌న్‌లోని 58 కిలోమీట‌ర్ల 4 లేన్ల ర‌హ‌దారిని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోది జాతికి అంకితం చేశారు. 98 కీలోమీట‌ర్ల షోలాపూర్ – ఎదౌషి సెక్ష‌న్‌లో 4 లేన్ల అతిపెద్ద ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రాజెక్టు ఉంది. దీని వ్య‌యం 972 కోట్ల రూపాయ‌లు. ఇందువ‌ల్ల షోలాపూర్‌లో మ‌ర‌ట్వాడా ప్రాంతం అనుసంధానం మెరుగ‌వుతుంది. ప్ర‌ధాన‌మంత్రి 2014లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాప‌న చేశారు.