జ‌న‌ర‌ల్ కేట‌గిరీల్లో ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు విద్యా, ఉద్యోగాల్లో ప‌దిశాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించే 124వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లును పార్ల‌మెంట్ ఆమోదించింది

124వ రాజ్యంగ స‌వ‌ర‌ణ బిల్లును గ‌ణ‌రాత్రి రాజ్య‌స‌భ ఆమోదించ‌డంతో ఆ బిల్లును  పార్ల‌మెంటు ఆమోదం ల‌భించింది. లోక్‌స‌భ అంతకుముందే ఆ బిల్లును ఆమోదించింది. ఆ చ‌ట్టం స‌మాజంలో ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో, విద్యా రంగాల్లో ప‌దిశాతం రిజ‌రే్వ‌ష‌న్‌ను క‌ల్పిస్తుంది. బిల్లుపైన రాజ్య‌స‌భ‌లో నిన్న ప‌దిగంట‌ల‌పాటు చర్చ జ‌రిగింది. ఆ చ‌ర్చ‌కు  స‌మాధానం చెపుతూ సామాజిక న్యాయం, సాధికార‌త మంత్రి తావ‌ర్‌చంద్ గెహ్లాట్ ఉద్దిష్ట ల‌బ్దిదారుల‌కు ఆర్థిక విద్యా, సాధికార‌త ఆ బిల్లు ల‌క్ష్య‌మ‌ని మంచి ఉద్దేశ్యాల‌తోనే ఆ బిల్లు తెచ్చామ‌ని చెప్పారు. బిల్లు హ‌డావిడిగా తెచ్చార‌న్న ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌లు ఆయ‌న ఖండించారు. ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉంద‌ని త‌మ ప్ర‌భుత్వం ఇప్పుడు న్యాయం చేసింద‌ని ఆయ‌న చెప్పారు. అయితే ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసిల‌కు ప్ర‌స్తుతం ఉన్న కోటాకు ఎటువంటి నష్టం లేకుండా ఆ రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తామ‌ని మంత్రి చెప్పారు. చ‌ర్చ‌లో పాల్గొంటూ కాంగ్రెస్ నాయ‌కుడు ఆనంద శ‌ర్మ త‌మ పార్టీ బిల్లుకు మ‌ద్ద‌తిస్తుంద‌ని అయితే బిల్లు తెచ్చిన స‌మ‌యం సంద‌ర్భం ప్ర‌శ్నార్థ‌క‌మ‌ని అన్నారు. స‌మాజ్‌వాద్ పార్టీ, బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ, బిజెడి, జెడియు బిల్లుకు మ‌ద్ద‌తు ప‌లికాయి. అయితే కొంద‌రు  స‌భ్యులు ఓబిసిల‌ను 54శాతం రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని ఎస్‌సి, ఎస్‌టిల కోటా 25శాతం పెంచాల‌ని డిమాండ్ చేశారు. చ‌ర్చ‌లో జోక్యం చేసుకుంటూ న్యాయ‌శాఖ‌మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ రాజ్యంగ స‌వ‌ర‌ణ‌లు చేసే హ‌క్కు పార్ల‌మెంటుకు ఉంటుంద‌ని చెప్పారు. ఈ కోటా బిల్లు పార్ల‌మెంటు ఆమోదం పొంద‌టం సామాజిక న్యాయం పాధించిన విజ‌య‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ అభివ‌ర్ణించారు. యువ‌జ‌నులు దేశప‌రివ‌ర్త‌న‌కు పాటుప‌డ్డానికి దీనిద్వారా విస్తృత‌మైన అవ‌కాశాలు వారికి క‌లుగుతాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.