రామ‌జ‌న్మ‌భూమి-బాబ్రీమ‌సీద్ స్థ‌ల యాజ‌మాన్యం కేసులో సుప్రీంకోర్టు 29వ తేదీన వాద‌న‌లు వింటుంది

రామ‌జ‌న్మ‌భూమి-బాబ్రీమ‌సీదు భూమి హ‌క్కు వివాదం కేసును ఈనెల 29న విచారించాల‌ని సుప్రీంకోర్టు నిర్ణ‌యించింది. న్యాయ‌మూర్తి ల‌లిత్ ఈ కేసు విచార‌ణ నుంచి విర‌మించుకున్నారు. క‌నుక రాజ్యంగ ధ‌ర్మాస‌నం తిరిగి ఏర్పాటు చేయాల్సి వుంది. ఈ వివాద‌స్ప‌ద స్థ‌లానికి  సంబంధించిన కోర్టు ధిక్కార కేసులో క‌ళ్యాణ్‌సింగ్‌కు ఆయ‌న న్యాయ‌వాదిగా ప్రాతినిధ్యం వ‌హించార‌ని ముస్లిం ప‌క్షం పేర్కొన‌డంతో ఆయ‌న ఈ కేసు విచార‌ణ నుండి త‌ప్పుకున్నారు. ధ‌ర్మాస‌నంలోని మిగిలిన సభ్యులు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి రంజ‌త్ గొగొయ్ న్యాయ‌మూర్తులు బొబే, ర‌మ‌ణ‌, చంద్ర‌చూడ్ 2010లో అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్య‌తిరేకంగా సుప్రీంకోర్టులో 14 అప్పీళ్లు దాఖ‌ల‌య్యాయి. 2.77 ఎక‌రాల ఆ స్థ‌లాన్ని మూడు స‌మాన భాగాలుగా చేసి సున్నీ వ‌క్ఫ్‌బోర్డుకు నిర్మొహి అకాడాకు,  రామ్‌లల్లాకు పంచాల‌ని హై కోర్టు తీర్పునిచ్చంది. అయోధ్య‌లో వివాదాస్ప‌ద స్థ‌లంలో రామాల‌యాన్ని త్వ‌ర‌గా నిర్మించేందుకు ఆర్డినెన్సు జారీ చేయాల‌ని వివిధ హిందూత్వ సంస్థ‌లు డిమాండు చేస్తున్నాయి. ఇటీవ‌ల న్యాయ ప్ర‌క్రియ పూర్త‌యిన త‌రువాత‌నే అయోధ్య‌లో రామాల‌యంపై ఆర్డినెన్సుకు ఏ నిర్ణ‌య‌మైన జ‌ర‌గ‌గ‌ల‌ద‌ని ప్ర‌ధాని నరేంద్ర‌మోదీ అన్నారు.