చిన్న వ్యాపారాలకు సంబంధించి – GST మండలి తీసుకున్న నిర్ణయాల వల్ల – సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు, వ్యాపారస్తులకు, సేవారంగానికీ – గొప్ప మేలు జరుగుతుందని – ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు

చిన్న వ్యాపారాలకు సంబంధించి – GST మండలి తీసుకున్న నిర్ణయాల వల్ల  – సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు, వ్యాపారస్తులకు, సేవారంగానికీ – గొప్ప మేలు జరుగుతుందని – ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.  ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన – నిన్న – న్యూఢిల్లీ లో సమావేశమైన – GST మండలి – చిన్న వ్యాపారాలకు – వెసులుబాటు కల్పించే విధంగా – GST మినహాయింపు పరిధిని – రెట్టింపు చేసింది.  GST మినహాయింపు పరిధిని – ఈశాన్య రాష్ట్రాలకు 20 లక్షల వరకూ – దేశంలోని మిగిలిన ప్రాంతాలకు 40 లక్షల వరకు – పెంచారు. GST కంపొజిషన్ పధకం కింద – చిన్న వ్యాపారులు – తమ టర్న్ ఓవర్ పై – ఒక శాతం పన్ను చెల్లించాలని కూడా – మండలి – నిర్ణయించింది. గతంలో కోటి రూపాయలుగా ఉన్న ఈ టర్న్ ఓవర్ పరిమితిని – ఇప్పుడు కోటీ 50 లక్షలకు పెంచారు. ఈ నిర్ణయాలు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి అమలులోకి వస్తాయి.  GST మండలి తీసుకున్న నిర్ణయాలను – ప్రధానమంత్రి – ఒక ట్వీట్ లో – ప్రశంసిస్తూ – తమ ప్రభుత్వం – సరళమైన, ప్రజలకు అనుకూలమైన GST విధానాలను రూపొందించడానికి – కట్టుబడి ఉందని – పేర్కొన్నారు.