నాల్గవ రైజినా డైలాగ్

నాల్గవ రైజినా డైలాగ్ న్యూఢిల్లీలో ముగిసింది. ఇందులో ప్రముఖ అంతర్జాతీయ విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, వ్యూహాత్మక నిపుణులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, నార్వే ప్రధాని శ్రీమతి ఎర్నా సోల్బర్గ్ ప్రారంభ సమావేశాల్లో పాల్గొన్నారు. రెండ రోజుల పాటు ఈ దస్సు సమావేశాలు పలు అంశాలతో జరిగాయి. రైజినా డైలాగ్ ప్రతి సంవత్సరం భారత్ నిర్వహించే కార్యక్రమాలలో ప్రముఖ కార్యక్రమం. దీనిని మనదేశంలోని ప్రముఖ థింక్ టాంక్ ‘అబ్సర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్’ భారత విదేశీ వ్యవహారాల శాఖతో కలిసి నిర్వహిస్తుంది.

నార్వే ప్రధాని ఎర్నా సోల్బర్గ్ మాట్లాడుతూ బలమే సరైనదన్న భావజాలం సముద్ర నిర్వహణకు సరికాదన్నారు. దానికే కాదు మరి దేనికీ కూడా ఈ పద్ధతి పనికిరాదని వ్యాఖ్యానించారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రధానోపన్యాసం చేస్తూ భారత్ ప్రజాస్వామ్య బద్ధమైన, నిబంధనలతో కూడిన అంతర్జాతీయ క్రమానికి కట్టుబడి ఉందని అన్నారు. ఈ విధానంలో అన్ని దేశాలూ సమానం అంటూ సౌత్ చైనా సీలో పరోక్షంగా పాల్పడుతున్న విస్తరణా కార్యకలాపాల అంశాన్ని ఆమె ప్రస్తావించారు. పలు పానల్ సంభాషణల్లో దీనిపై లోతుకంటా పరిశీలిన చేశారు.

‘రైజినా డైలాగ్’ బహుపాక్షిక సదస్సు. అంతర్జాతీయ కమ్యూనిటీ ఎదుర్కొంటున్న పలు తీవ్ర సవాళ్లను ఇందులో చర్చిస్తారు. ఈ ‘డైలాగ్’ మల్టీ-స్టేక్‌హల్డర్ల నిర్మాణంలో రూపొందించారు. ఇందులో క్రాస్-సెక్టోరియల్’ చర్చలు కూడా జరుగుతాయి. ఇందులో వివిధ దేశాల అధిపతులు, కేబినెట్ మంత్రలు, స్థానిక ప్రభుత్వ అధికారులు, పెద్ద ప్రైవైట్ సెక్టర్ ఎగ్జక్యూటివ్‌లు కూడా ఉన్నారు. ఈ సదస్సు ముగింపు సమావేశంలో మలేసియన్ నాయకులు అన్వర్ ఇబ్రహీం ప్రసంగించారు. ప్రస్తుతం మలేసియా ప్రధానిగా కొనసాగుతున్న మహథీర్ మొహమ్మద్ సక్సెసర్‌ అని వింటున్నాం.

అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఒఆర్ఎఫ్) ఛైర్మన్ సంజయ్ జోషి మాట్లాడుతూ, ఈ చర్చలు గతంలో చేసుకున్న ఒప్పందాలను తిరిగి క్రమంలో పెట్టే అవకాశం ఇస్తున్నాయని భావించారు. ఈ శతాబ్దం మానవ ప్రయత్నాలకు రూపును ఇచ్చేలా తిరిగి నిబంధనలను రూపొందించుకోగలమని అభిప్రాయపడ్డారు. అబ్సర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ డా. సమిర్ శరణ్ మాట్లాడుతూ ఈ ఏడాది రైజినా డైలాగ్ చర్చల్లో యూరప్ లేదా విస్తరంగా చెప్పాలంటే యురేసియాపై ప్రధానంగా చర్చించారు.

ఈ సదస్సులో వేడి వాడి చర్చలకు కారణమయిన మరో ముఖ్యమైన సబ్జక్టు ఇండో-ఫసిఫిక్ ప్రాంతం. భారత నౌక విభాగం అడ్మిరల్ సునిల్ లంబా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు సంబంధించి అత్యున్నత సైనికాధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సును ఉద్దేశించి భారత విదేశాంగ శాఖా కార్యదర్శి విజయ్ గోఖలే కూడా ప్రసంగించారు. పొరుగు దేశాలతో పాటు ఇతర దేశాలతో భారత్ అనుసరిస్తున్న విదేశీ విధాన సవాళ్లను ప్రస్తావించారు.

రైజినా డైలాగ్‌లో 2000 మంది భాగస్వామ్యమయ్యారు. ఇందులో 600 మంది ప్రతినిధులు, ఉపన్యాసకులు ఉన్నారు. 92 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. వీరంతా ‘‘ఏ వరల్డ్ రీ ఆర్డర్-న్యూ జియోమెట్రిక్స్, ఫ్లూయిడ్ పార్టనర్‌షిప్స్: అన్ సర్టెయిన్ ఔట్‌కమ్స్’’ అనే అంశంపై ప్రసంగించారు. ఓఆర్ఎఫ్ ఛైర్మన్ సుంజోయ్ జోషీ మాటల ప్రకారం మూడు రోజుల అంతర్ముఖ చర్చల ఫలితంగా ప్రపంచ స్థాయిలో శాంతి దిశగా అడగులు వేసే అడుగుల కోసం నూతన భూమికను సృష్టించుకోగలమనే ఆశాభావం వ్యక్తమైంది.

ప్రపంచ స్థాయి అగ్ర నేతలైన మాజీ బ్రిటిష్ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్, మాజీ ఇటాలియన్ ప్రిమియర్ పాలో జెంటిలోని, మాజీ కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్, మాజీ స్వీడిష్ ప్రధాన మంత్రి కార్ల్ బిల్ట్, అప్ఘన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌లతోపాటు ఇరాన్, ఆస్ట్రేలియా, స్పెయిన్, మంగోలియా, నేపాల్‌కు చెందిన విదేశాంగ మంత్రులు మూడు రోజుల సదస్సులో ప్రసంగించారు.

రైజినా డైలాగ్‌ని ఆసియాలోని అత్యంత ప్రతిష్టాత్మక చర్చల్లో ఒకటిగా చేసేందుకు భారీ స్థాయిలో భాగస్వామ్యం ఉండేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సింగపూర్‌లో ప్రతి ఏటా జరిగే షాంగ్రిలా డైలాగ్‌ను మించేలా దీన్ని రూపొందించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నత స్థాయి చట్ట రూపకర్తలు ఇందులో పాల్గొన్ని తమ ప్రభుత్వాల జాతీయ పాలసీలను రూపొందించుకునేలా ఇది ఉపయోగపడాలని చూడడమే దీని ముఖ్య ఉద్దేశం. గత ఏడాది జరిగిన షాంగ్రిలా డైలాగ్‌కి భారత ప్రధాన మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా ప్రతిష్టాత్మక స్థాయిలో ఇండో-పసిఫిక్‌పై ప్రసంగం చేశారు. రైజినా డైలాగ్ సందర్భంలోనూ ఇదే సందేశం కొనసాగుతుంది.

భారత విదేశీ వ్యవహారాల మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని ఈ సందర్భంగా వివరించారు. అంతేకాక 2019లో అనుసరించే భవిష్యత్ విధానాలను వివరించారు. ప్రస్తుతం ప్రపంచం అమెరికా-జపాన్-ఆస్ట్రేలియా కూటమిగా, మరోపక్క రష్యా-చైనా కూటమిగా ఏర్పడుతోంది. భారత దేశం మాత్రం ఇరు కూటములతో సమానంగా వ్యవహరించాలని ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో సుష్మా స్వరాజ్ భారత దేశం అంతర్జాతీయ స్థాయిలో సమగ్రంగా, దృఢమైన భాగస్వామ్యం కోరుకుంటోందని చెప్పారు. దీని ఉద్దేశాన్ని కూడా వివరించారు. ‘సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్’ అనే నినాదాన్ని వినిపించారు. అంటే అందరి భాగస్వామ్యంతో అందరి అభివృద్ధి అని దీని అర్థం.

రచన: రంజిత్ కుమార్, దౌత్య సంపాదకులు, నవోదయ టైమ్స్