పుణెలో జ‌రుగుతున్న ఖేలో ఇండియా యువ‌జ‌న క్రీడ‌ల్లో ప‌త‌కాల‌ప‌ట్టిక‌లో 15 స్వ‌ర్ణ ప‌త‌కాల‌తో మ‌హారాష్ట్ర అగ్ర‌స్థానంలో నిలిచింది

పూణెలో జ‌రుగుతున్న ఖేలో ఇండియా యువ‌జ‌న క్రీడోత్స‌వాలు నిన్న రెంవ రోజుక‌ల్లా 15 స్వ‌రాష్ట్రాల‌తో స‌హా మొత్తం 57 ప‌త‌కాల‌తో మ‌హారాష్ట్ర ప‌త‌కాల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో నిలిచింది. నిన్న ఒక్క రోజునే 11 బంగారు ప‌త‌కాలు గెలుచుకుంది. వీటిలో 5 జిమ్నాస్టిక్స్‌లో, 3 స్విమ్మింగ్‌లో 2 అథ్లెటిక్స్‌లో ఒక‌టి వెయిట్ లిఫ్టింగ్‌లో గెలుచుకుంది. ఇది కాకుండా 19 వెండి 23 కంచుప‌త‌కాల‌ను కూడా గెలుచుకుంది. కాగా 13 బంగారు, 10 వెడి, 13 కంచు ప‌త‌కాల‌తో ఢిల్లీ రెండ‌వ‌స్థానంలో నిలిచింది.