బీజేపీ జాతీయ మండ‌లి రెండు రోజుల స‌మావేశం ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభం అవుతుంది.

రెండు రోజుల పాటు నిర్వహించే – BJP జాతీయ మండలి సమావేశం – ఈ రోజు – న్యూఢిల్లీ లో – ప్రారంభం కానుంది.   BJP జాతీయ అధ్యక్షుడు అమిత్ షా – ఈ సమావేశాన్ని – ప్రారంభిస్తారు. పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు పూనమ్ మహాజన్ – ఈ వివరాలను – మీడియాకు తెలియజేస్తూ – దేశంలోని వివిధ ప్రాంతాల నుండి – దాదాపు 12 వేల మంది ప్రతినిధులు – ఈ సమావేశానికి – హాజరౌతున్నట్లు – చెప్పారు.  రేపు జరిగే – ముగింపు కార్యక్రమంలో – ప్రధానమంత్రి నరేంద్రమోదీ – ప్రసంగిస్తారు. ఇలా ఉండగా – పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా – మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహన్, రమన్ సింగ్, వసుంధరా రాజే లను నియమించినట్లు – BJP ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ – నిన్న – ప్రకటనలో – తెలిపారు.