ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగే కుంభమేళాకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగే కుంభమేళాకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రపంచంలో అతి పెద్దదిగా పేర్కొనే ఈ మేళా రేపు పవిత్ర స్నానాలు ఆచరించడంతో ప్రారంభం అవుతుంది. ఈ కుంభమేళా ను దివ్యమైన, భవ్యమైన కుంభ మేళాగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభివర్ణించారు.  ఈ ఉత్సవాన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. ఈ ప్రసారాల కోసం ఆకాశవాణి ప్రత్యేకంగా 1 కిలో వాట్ ఎఫ్. ఎం. Transmitter  కుంభ వాణిని ఏర్పాటు చేసింది. ఈ transmitar ఏరొజు పని చేయడం ప్రారంభిస్తుంది. కుంభ వాణి ప్రసారాలు ఉదయం 5గంటల 55 నిముషాల నుండి రాత్రి 10 గంటల 5 నిముషాల వరకు 35 కిలోమీటర్ల పరిధిలో వినవచ్చు. ఈ ప్రసారాలను మొదటి సారిగా యూ ట్యూబ్ channel లో కూడా ప్రసారం చేసేందుకు ఆకాశవాణి ఏర్పాట్లు చేసింది. కుంభ మేళా పై ప్రత్యెక కార్యక్రమాలను దూరదర్శన్ ఈ నెల 15 వ తేదీ నుండి ప్రతి రోజూ 3 గంటల పాటు ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలు మకర సంక్రాంతి సందర్భంగా రేపు, మౌని అమావాస్య సందర్భంగా వచ్చేనెల 4 వ తేదీన, వసంత పంచమి సందర్భంగా వచ్చే నెల 10 వ తేదీన  జరిగే 3 షాహి స్నాన్ – పవిత్ర స్నానాల సందర్భలను ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి.