పూణేలో జరుగుతున్న ఖేలో ఇండియా యువ‌జ‌న‌ క్రీడ‌ల ప‌త‌కాల సాధ‌న‌లో మ‌హారాష్ర్ట ఆధిప‌త్యం కొన‌సాగుతుంది.

పూణేలో జరుగుతున్న ఖెలో ఇండియా యువజన క్రీడోత్సవాలలో మహారాష్ట్ర ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఈ క్రీడోత్సవాలకు ఆతిథ్యం ఇస్తోన్న మహారాష్ట్ర 56 స్వర్ణ పతకాలు, 44 రజత పతకాలు, 56 కాంస్య పతకాలు సాధించింది. మొత్తం 156 పతకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచింది.  ఢిల్లీ జట్టు 9 స్వర్ణ పతకాలు సాధించినప్పటికీ మొత్తం పతకాల సంఖ్యలో మహారాష్ట్ర తర్వాత స్థానాన్ని ఆక్రమించింది.  ఆ జట్టుకు 45 స్వర్ణ, 27 రజత, 38 కాంస్య పతకాలు లభించాయి. తర్వాతి స్థానం లో నిలిచిన హర్యానా జట్టు 33 స్వర్ణ, 34 రజత, 36  కాంస్య పతకాలు పొందింది. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన ఈ మూడు రాష్ట్రాలు వంద పతకాల మైలు రాయిని అధిగమించాయి. వ్యక్తిగత విభాగాల్లో పది సంవత్సరాల అభినవ్ షా 10 మీటర్ల  mixed ఎయిర్ రైఫిల్ పోటీల్లో మేహులీ ఘోష్ తో కలిసి స్వర్ణ పతకం సాధించారు. ఈ క్రీడల్లో అతి తక్కువ వయస్సులో స్వర్ణ పతకం సాధించిన క్రీడాకారుడిగా అభినవ్ షా రికార్డు సృష్టించారు.