ప‌దిశాతం రిజ‌ర్వేష‌న్ల కింద వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి ఉన్న‌త విద్యా సంస్థ‌ల్లో వేలాది సీట్లు ల‌భ్య‌మ‌వుతాయ‌ని కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ చెప్పారు.

వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి ఉన్నత విద్య సంస్థ‌ల్లో కొత్త కేట‌గిరి కింద వేలాది సీట్లు ల‌భ్య‌మవుతాయ‌ని  కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి ప్ర‌కాష్ జ‌వదేక‌ర్ చెప్పారు. నిన్న సాయంత్రం జ‌య‌పూర్‌లో జ‌రిగిన ఒక కార్య్ర‌క‌మంలో జ‌వ‌దేక‌ర్ మాట్లాడుతూ ఆర్థిక న్యాయం కోసం మోదీ ప్ర‌భుత్వ నిర్ణ‌యం విప్ల‌వాత్మ‌క‌మైన‌ద‌ని అన్నారు. విద్యా సంవ‌త్స‌రం ఆరంభ‌మ‌య్యే వ‌చ్చే జూన్ నుంచి ఐఐటీ , ట్రిపుల్ ఐటీ, నీట్ త‌దిత‌ర విద్యా  సంస్థ‌ల్లో ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్ కింద వేలాది సీట్లు ల‌భ్య‌మ‌వుతాయ‌ని కేంద్ర మంత్రి చెప్పారు. ఇత‌ర వ‌ర్గాల వారికి చెందిన  ఏ ఒక్క‌రి రిజ‌ర్వేష‌న్ కోటాను  ర‌ద్దు చేయ‌డం ఉండ‌ద‌ని , జ‌న‌ర‌ల్ కేట‌గిరి నుంచి  ఆర్థికంగా వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల‌కు అద‌నంగా ప‌దిశాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌ని జ‌వ‌దేక‌ర్ చెప్పారు. జ‌న‌ర‌ల్ కేట‌గిరిలో ప‌దిశాతం రిజ‌ర్వేష‌న్‌కు రాష్ర్ట‌ప‌తి రాంనాథ్ కోవింద్  ఆమోదం తెలుప‌డంతో రాజ్యాంగ‌బ‌ద్ధ‌త ల‌భించింద‌ని అన్నారు. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ నెల 9న పార్ల‌మెంట్ ఆమోదించింది.