రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఈ రోజు 30 మందికి ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారాలు ప్రదానంం చేస్తారు

వారణాసిలో మూడు రోజుల పాటు జరుగుతోన్న ప్రవాస భారతీయ దివస్ ఈ రోజు ముగుస్తుంది. ఈ సాయంత్రం జరిగే ముగింపు సభలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 30 మందికి రాష్ట్రపతి ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డులను ప్రదానం చే్తారు. ఈ ప్రవాస భారతీయ సమ్మేళనంలో ఐదు వేల మందికి పైగా ప్రవాస భారతీయులు పాల్గొంటున్నారు. సోమవారంనాడు ఈ ప్రవాస భారతీయ దివస్ యువజనులు, ఉత్తర ప్రదేశ్ ప్రవాస భారతీయులతో ప్రారంభమవుతుంది. నిన్న రెండవ రోజు ఈ దివస్ ను ప్రదానమంత్రి నరేంద్రమోది ప్రారంభించారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక రాజధాని వారణాసిలో మొట్టమొదటి సారి మూడు రోజుల పాటు ప్రవాస భారతీయ దివస్ ను నిర్వహిస్తున్నారు.