విజయవంతంగా భారత అంతరిక్ష ప్రయోగాల కొనసాగింపు

భారత అంతరిక్ష ప్రయోగాలు విజవంతంగా కొనసాగుతున్నాయి. ఇటీవలి మైక్రోశాట్ ఆర్, కలామ్‌శాట్‌ల ప్రయోగాలు కూడా ఇందులో ఉన్నాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన ‘పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్’ (పిఎస్ఎల్‌వి) సి44ను కూడా ఆంధ్రప్రదేశ్ లోని సతీష్ ధావన్ అంతరిక్షకేంద్రం నుంచి ప్రయోగించారు. ఇది భారత మిలటరీ శాటిలైట్  ‘మైక్రోశాట్-ఆర్’, అలాగే విద్యార్థుల పేలోడ్ ‘కలామ్‌శాట్’లను విజయవంతంగా తీసుకువెళ్లింది.

 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన ముఖ్యమైన పోలార్ రాకెట్ తొలి లాంచ్-పాడ్ నుంచి 28 గంటల అనంతరం నక్షత్రాలతో నిండిన స్వచ్ఛమైన ఆకాశంలోకి ఇది దూసుకుపోయింది. 2019 సంవత్సరంలో ఇస్రో చేపట్టిన ఈ తొలి మిషన్ విజయవంతమైంది.

 

46వ ఫ్లైట్‌లో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పిఎస్ఎల్‌వి-సి44) 740 కేజీల బరువున్న సైనిక అవసరాలకు ఉద్దేశించిన మైక్రోశాట్-ఆర్ ఇమేజింగ్ శాటిలైట్‌ను  అంతరిక్షంలోకి ప్రయోగించిన 14 నిమిషాల్లో 274 కిలోమీటర్ల పోలార్ సన్ సింక్రోనస్ కక్ష్యలోకి ప్రవేశించిందని ఇస్రో వెల్లడించింది.

 

నాల్గవ దశకు చెందిన రాకెట్‌లో  10-సిఎం పరిమాణం ఉన్న క్యూబ్ కలామ్‌శాట్ బరువు 1.2 కిలోలు. ఇది అతివిశాలమైన వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించింది. కొద్ది పేలోడ్‌ను ఉపయోగించి ప్రయోగాలు కొనసాగించడానికి ఇది ‘ఆర్బిటల్ ప్లాట్‌ఫామ్‌’గా ఉపయోగపడుతుంది. ‘కలామ్‌శాట్’ భారత అత్యున్నత తేలికైన శాటిలైట్.

 

‘కలామ్‌శాట్’ ఫెమ్టో శాటిలైట్. ఫెమ్టో శాటిలైట్ అనే పదాన్ని కృత్రిమ శాటిలైట్లకు సహజంగా ఉపయోగిస్తుంటారు. దీని అడుగున వెట్ మాస్ 100 జి (3.5ఒజడ్) ఉంటుంది. కొన్ని రకాల ఫెమ్టో శాటిలైట్ల డిజైన్లకు పెద్ద ‘మదర్’ శాటిలైట్ల’ అవసరం ఉంటుంది. దీని ద్వారా గ్రౌండ్ కంట్రోలర్స్‌ తో కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది. మూడు ప్రొటోటైప్ ‘చిప్ శాటిలైట్స్’ని కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) నుంచి స్పేస్ షటల్ ప్రయత్నాల్లో భాగంగా 2011 మేలో ప్రయోగించారు. వీటిని పరీక్షించించేందుకు ఐఎస్ఎస్ ఎక్స్ టర్నల్ ప్లాట్‌ఫామ్ అయిన ‘మెటీరియల్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎక్స్‌ పెరిమెంట్’ (ఎంఐఎస్ఎస్ఇ-8)కి  అనుసంధించారు.

 

కలామ్‌శాట్‌కి భారత మాజీ రాష్ట్రపతి డా. ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ పేరును పెట్టారు. దీనిని తమిళనాడుకు చెందిన భారత హైస్కూల్ విద్యార్థుల బృందం రూపొందించింది. దీనికి పద్దెనిమిది సంవత్సరాల రిఫాత్ షరూక్ సారథ్యం వహించారు. ఇతను తమిళనాడులోని పల్లాపట్టి ఊరుకి చెందిన వాడు. ఈ హైస్కూల్ బృందం ఇస్రో వర్క్‌ షాపుల్లో పాల్గొంది. అంతేకాదు ‘ఐడూడిల్’, ‘లర్నింగ్.ఇంక్’, ‘నాసా’ల నుంచి ఎడ్యుకేషన్ ప్రోగ్రాములు తీసుకుంది. వీరిలో ఎంపిక చేసిన విద్యార్థుల బృందం ప్రయోగాల రూపకల్పనా అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. అవి ‘నాసా’ ద్వారా అంతరిక్ష్యంలోకి ప్రయోగిస్తారు. కలామ్ శాట్‌ని నాసా ప్రయోగించింది. ఇదే కాదు ఇతర ప్రయోగాలు అంటే టెర్రీర్ ఓరియాన్ సౌండింగ్ రాకెట్ కి సంబంధించి పలు ప్రయోగాలను కూడా 2017 జూన్‌లో వర్జీనియాలోని వల్లోప్స్ ఐలండ్ ఫ్లైట్‌ఫెసిలిటీ నుంచి చేశారు.

 ఇస్రో ఛైర్మన్ కె.శివన్ మాట్లాడుతూ పిఎస్4-కలామ్‌శాట్ ప్రయోగం పరిమితకాలంతో కూడినదన్నారు. టేక్ ఆఫ్ అయిన 1.5 గంటలకు ఇది మొదలై పధ్నాలుగు గంటలు అంటే శుక్రవారం అర్థరాత్రి వరకూ ఉంటుంది.

 

 మైక్రోశాట్-ఆర్, దాని పేలోడ్ పనులను ‘డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలెప్‌మెంట్ ఆర్గనైజేషన్’ (డిఆర్‌డివొ)కి చెందిన కొన్ని ప్రయోగశాలల్లో కూర్పుచేశారు. ఇది పూర్తిగా సైనిక అవసరాలకు ఉద్దేశించింది. ఉపగ్రహ కూర్పు అంతా బయట జరిగింది. ఇస్రో దీన్ని తన సిస్టమ్స్, లాంచ్ వెహికల్‌తో అనుసంధాన చర్యలు వంటివాటిని చేసింది. ఒక ఆర్గనైజేషన్ కస్టమర్ శాటిలైట్ పరంగా వ్యవహరించిన తీరులో అనమాట.

 

ఈ ఏడాది ఇస్రో చంద్రయాన్-2తో బిజీగా ఉండనుంది. ఇది భారత రెండవ మూన్ మిషన్. దీన్ని ప్రయోగించడానికి పథక రచన జరిగింది. ఇస్రో తన కొత్త చిన్న శాటిలైట్ వెహికల్ రాకెట్లను (స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఎస్ఎస్‌ఎల్‌వి) కూడా ప్రయోగించనుంది. ఇవి కాకుండా మరో ముఖ్యమైన మిషన్ కూడా ఉంది. అదేమిటంటే రెండు ఇండియన్ డేటా రిలే శాటిలైట్ సిస్టమ్ (ఐడిఆర్ఎస్ఎస్) శాటిలైట్లను కూడా ప్రయోగించనుంది. వీటిల్లో ఒకటి ఈ  ఏడాది ప్రయోగించనుంది. ఇది భారత రిమోట్ సెన్సింగ్/ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ను జియో సింక్రనైజ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్-3 (జిఎస్ఎల్‌వి ఎంకె-3)లతో నిరంతరాయంగా సమాచారాన్ని పంపుతుంది. దీనిని 2022లో ముగ్గురు భారత వ్యోమగాములతో చేపట్టాలని పథకం రూపొందించారు.

 

భారత ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది  స్వాతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకుని మాట్లాడుతూ 2022 నాటికి భారత్ స్వాతంత్రాన్ని పొంది 75 సంవత్సరాలు పూర్తవుతుంది. భారతీయుడు త్రివర్ణపతాకాన్ని చేతిలో పెట్టుకుని అంతరిక్షానికి పయనిస్తాడు’ అని అన్నారు. భారత అంతరిక్ష ప్రయోగాలను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాలన్న నిబద్ధతగల ప్రధాని మోదీ. భవిష్యత్‌కు ఉపయోగపడే రీతిలో భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు ఎంతో సంక్లిష్టమైన ప్రయోగాలను చేపట్టడంలో ముందుండడమే కాదు అంతరిక్ష డిజైన్ వంటి రంగాలలో తమదైన విశిష్టమైన ముద్రను సైతం వేస్తున్నారు. ఇంకో విశేషం ఏమిటంటే ఇటీవల  వినూత్న ఆలోచనైన మినియేచర్ శాటిలైట్ డిజైన్లు (క్యూబ్‌శాట్స్) మనదేశంలో మొదలయ్యాయి.

రచన: పదమ్ సింగ్, ఎఐఆర్: వార్తా విశ్లేషకులు