ఉత్తరాఖండ్ లో ని హరిద్వార్ లో కల్తీ మద్యం తాగి మరణించినవారి సంఖ్య 19కి పెరిగింది.

ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, హ‌రిద్వారా జిల్లా, భ‌గ‌వాన్‌పూర్ ప్రాంతం లో క‌ల్తీ మ‌ద్యం దుర్ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన వారి సంఖ్య 19 కి పెరిగింది.  క‌ల్తీ మ‌ద్యం తాగి తీవ్ర అస్వ‌స్థ‌త కు గురై ఆసుప‌త్రుల్లో చేరిన అనేక మంది ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.  బాధితుల చికిత్స మెరుగుగా జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి త్రివేంద్ర సింగ్‌, జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.