అస్సాం ఈశాన్య రాష్ర్టాల ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌కు పౌర‌స‌త్వ బిల్లు ఏ విధంగానూ హాని చేయ‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ హామినిచ్చారు.

అస్సాం ఈశాన్య రాష్ర్టాల ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌కు పౌర‌స‌త్వ బిల్లు ఏ విధంగానూ హాని చేయ‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ హామినిచ్చారు. అస్సాంలో ఛాంగ్‌సారిలో నిన్న జరిగిన  బ‌హిరంగ స‌భ‌లో అయన ప్ర‌సంగించారు. రాష్ర్ట ప్ర‌భుత్వాల సిఫార్సులను పుర‌స్క‌రించుకుని అన్ని అంశాల‌ను మ‌దింపు చేసిన త‌ర్వాతే పౌర‌స‌త్వం ప్ర‌ధానం చేయ‌డం జ‌రుగుతుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. ఇరుగుపొరుగు దేశాల్లో అత్యాచారాల‌కు గురైన అక్క‌డి మైనార్టీల‌కు ఆశ్ర‌యం క‌ల్పించ‌డానికి త‌న ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ఆయన  చెప్పారు. ప్ర‌ధాన‌మంత్రి ఈశాన్య రాష్ర్టాల లో ప‌లు ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు. గువాహ‌టి వ‌ద్ద బ్ర‌హ్మ‌పుత్ర నదిపైన నిర్మించే ఆరు వ‌రుస‌ల 1600 మీట‌ర్ల వంతెన‌కు, ఈశాన్య గ్యాస్ గ్రిడ్‌కు కామ్‌రూప్‌, క‌రీంగంజ్ జిల్లాల్లో గ్యాస్ పంపిణీ వ్య‌వ‌స్థ‌ల‌కు 729 కిలో మీట‌ర్ల గ్యాస్ పైప్‌లైన్‌కు, నొమాలి గార్డెన్, బ‌యో రిఫైన‌రీకి ఆయ‌న శంకుస్థాప‌న చేశారు.  అంత‌కుముందు ప్ర‌ధాన‌మంత్రి అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ఈటా న‌గ‌ర్‌లో ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల‌ను ప్రారంభించారు. హోలొంగిలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. ఈటాన‌గ‌ర్‌లో దూర‌ద‌ర్శ‌న్ అరుణ్ ప్ర‌భ ఛాన‌ల్‌ను మోదీ ప్రారంభించారు. భార‌త చ‌ల‌న‌చిత్ర టెలివిజ‌న్ సంస్థ శాశ్వ‌త క్యాంప‌స్‌కు శంకుస్థాప‌న చేశారు. ఈశాన్య ప్రాంతం ప్ర‌తి రంగంలోనూ అభివృద్ధి సాధించిన‌ప్పుడే నవీన భార‌తం స‌హ‌కారం అవుతుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడంలో పోటీ పడుతున్నాయని అగర్తల లో జరిగిన ఒక ర్యాలీ లో ఆయన పేర్కొన్నారు.