చిట్‌ఫండ్ అవ‌క‌త‌వ‌క‌ల కేసులో కోల్‌క‌త్తా పోలీసు క‌మిష‌న‌ర్ రాజీవ్‌కుమార్‌ను సిబిఐ ఈరోజు రెండో రోజు షిల్లాంగ్‌లో ప్ర‌శ్నిస్తారు.

చిట్ ఫండ్ అవకతవకల కేసులో కోల్కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ ను సి.బి.ఐ. ఈ రోజు రెండవ రోజూ కూడా ప్రశ్నిస్తుంది. మేఘాలయలోని షిల్లాంగ్ లో ఉన్న తమ కార్యాలయంలో సి.బి.ఐ. నిన్నటినుంచి రాజీవ్ కుమార్ ను ప్రశ్నిస్తోంది. నిన్న దాదాపు 8గంటలపాటు సి.బి.ఐ. అధికారులు రాజీవ్ కుమార్ ను ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, చిట్ ఫండ్ కేసుకు సంబంధించి తమ ముందు హాజరు కావలసిందిగా,  రాజ్యసభ మాజీ సభ్యుడు, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు కుణాల్ ఘోష్ ను సి.బి.ఐ. ఆదేశించింది.