జమ్మూ కాశ్మీరు లో 319 మంది GATE పరీక్ష అభ్యర్థులతో సహా 538 మందిని భారత వైమానిక దళం జమ్మూ, శ్రీనగర్ నగరాల మధ్య తరలించింది .

జమ్మూ కాశ్మీరు లో 319 మంది GATE పరీక్ష అభ్యర్థులతో సహా 538 మందిని భారత వైమానిక దళం జమ్మూ, శ్రీనగర్ నగరాల మధ్య తరలించింది . Jammu-Srinagar జాతీయ రహదారి మూసివేత వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న యాత్రికులు, స్థానికులు, GATE అభ్యర్థుల సౌకర్యార్థం వాయు సేన C17 Globemaster అనే ప్రత్యేక వాయు సేవలను ప్రారంభించిందని రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు.  ఈరోజు జరిగే Graduate Aptitude Test in Engineering పరీక్షకు హాజరయ్యే 319 మంది అభ్యర్థులను గత రెండు రోజులుగా శ్రీనగర్ విమానాశ్రయం నుండి జమ్మూ విమానాశ్రయానికి తరలించినట్టు ఆ ప్రతినిధి వివరించారు.