ద‌క్షిణ కాశ్మీర్ కుల్గాం జిల్లా దేవ‌సార ప్రాంతంలో జ‌రిగిన ఎదురు కాల్పుల్లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు మృతి చెందారు.

జ‌మ్మూ కాశ్మీర్ కుల్గాంలోని దేవ‌సార ప్రాంతం కెల్లాం గ్రామంలో ఈ ఉద‌యం ఉగ్ర‌వాదుల‌తో జ‌రిగిన ఎదురు కాల్పుల్లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు మ‌ర‌ణించారు. భ‌ద్ర‌తాద‌ళాల సంయుక్త బృందం ఈ ప్రాంతంలో సోదా చ‌ర్య‌లు ప్రారంభించ‌డంతో ఎదురుకాల్పులు ప్రారంభ‌మ‌య్యాయి. రాష్ట్ర డిజిపి దిల్బాగ్ సింగ్ ఆకాశ‌వాణితో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మూడు నుంచి ఐదుగురు ఉగ్ర‌వాదులు దాగి ఉన్నార‌ని చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు మృతి చెందిన వివ‌రాలు తెలియ‌రాలేదు.