న్యూజిలాండ్ Hamilton లో జ‌రిగిన చివ‌రి టి-20లో టీమ్ ఇండియా మ‌హిళా జ‌ట్టు 2 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యం పాలైంది. పురుషుల మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో టీమిండియా మహిళా జట్టు 2 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఆదివారం హామిల్టన్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. కీలక సమయంలో మంధాన వికెట్‌ కోల్పోవడంతో  జట్టుకు పరాజయం తప్పలేదు. దీంతో 3-0 తేడాతో టీమిండియాను ఆతిథ్య జట్టు క్లీన్ స్వీప్‌ చేసింది. సోఫీ డివైన్‌ రెండు వికెట్లు, అమీలియా కెర్‌, కాస్పెరెక్‌ చెరో వికెట్‌ తీయడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లకు 159 పరుగులు చేయగలిగింది.

పురుషుల మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. మూడు టీ20ల సిరీస్‌ 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో గెలవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ఈ సిరీస్‌ మీదా కన్నేసింది. మరోవైపు ఆతిథ్య జట్టు సైతం కనీసం ఈ సిరీస్‌ అయినా దక్కించుకుని పరువు నిలుపుకోవాలని చూస్తోంది.