ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, తమిళనాడులోని తిరుప్పూర్, కర్ణాటకలోని హుబ్లీలna ఈరోజు పలు అభివృద్ధి పథకాలను ఆయన ప్రారంభిస్తారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, తమిళనాడులోని తిరుప్పూర్, కర్ణాటకలోని హుబ్లీలాలో ఈరోజు పలు  అభివృద్ధి పథకాలను ఆయన ప్రారంభిస్తారు. Indian Strategic Petroleum Reserve Limited కు చెందిన 1.33 మిలియన్ మెట్రిక్ టన్నుల Visakhapatnam Strategic Petroleum Reserve facilityని ఈరోజు గుంటూరులో ఆయన జాతికి అంకితం చేస్తారు. కృష్ణా గోదావరి పరీవాహక ప్రాంతంలోని ONGC Vashishta, S1 అభివృద్ధి ప్రాజెక్టును  ఆయన ప్రారంభిస్తారు. క్రిష్ణపట్నంలోని Bharat Petroleum Corporation Limited కు చెందిన కొత్త టర్మినల్ కు ప్రధానమంత్రి శంకు స్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టుల వల్ల సహజ వాయు ఆధారిత పారిశ్రామిక యూనిట్లకు కొత్త ఊపు వస్తుందని భావిస్తున్నారు.

 

తమిళనాడులోని తిరుపూర్ లో ESIC హాస్పిటల్ కు ప్రధానమంత్రి శంకు స్థాపన చేస్తారు. లక్ష మందికి పైగా కార్మికులు, వారి కుటుంబాలకు ఈ 100 పడకల ఆసుపత్రి  వైద్య సేవలు అందిస్తుంది. తిరుచ్చి విమానాశ్రయంలో కొత్త సమీకృత భవనానికి, చెన్నై విమానాశ్రయ ఆధునీకరణ ప్రాజెక్టుకు అయన శంకు స్థాపన చేస్తారు. చెన్నై లోని 470 పడకల ESIC ఆసుపత్రిని ఆయన జాతికి అంకితం చేస్తారు. ఈ సందర్భంగా ఎన్నార్ లోని BPCL కోస్టల్ టర్మినల్ ను కూడా జాతికి అంకితం చేయనున్నారు. చెన్నై నౌకాశ్రయం నుండి మనాలి రిఫైనరీ కి కొత్త Crude Oil Pipeline ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. తమిళనాడుతో పాటు పొరుగు రాష్ట్రాలకు ఈ పైప్ line ఉపయుక్తంగా ఉంటుంది. AG-DMS Metro station నుండి Washermenpet Metro Stationకు మెట్రో Passenger Service ను కూడా మోదీ  ప్రారంభించనున్నారు.

 

కర్నాటక లో ధార్వాడ్ IIT కి ప్రధానమంత్రి శంకు స్థాపన చేస్తారు. హుబ్లీ లోని Indian Institute of Information Technology –Dharwad కు  కూడా ఆయన శంకు స్థాపన చేస్తారు. ధార్వాడ్ లో city Gas Distribution Projectను ఈరోజు జాతికి అంకితం చేయనున్నారు. పౌరులకు స్వచ్చమైన ఇంధనాన్ని పంపిణీ చేయడం లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ ను విస్తరిస్తారు. Indian Strategic Petroleum Reserve Limited కు చెందిన 1.5 మిలియన్ మెట్రిక్  టన్నుల Mangalore Strategic Petroleum Reserve SPR facilityని, 2.5 మిలియన్ మెట్రిక్ టన్నుల Padur SPR facilityని ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేస్తారు. 18 కిలోమీటర్ల పొడవైన Chikjajur-Mayakonda సెక్షన్ విస్తరణను ప్రారంభిస్తారు. ధార్వాడ్ లో Pradhan Mantri Awas Yojana కింద నిర్మించిన 2384 గృహాల E-Griha Pravesh కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.