ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభ మేళాలో మూడవది, చివరిది అయిన షాహీ స్నాన్ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో గంగా, యమున, సరస్వతి నదులు కలిసిన పవిత్ర త్రివేణీ సంగమంలో కుంభమేళా సందర్భంగా భక్తుల పుణ్య స్నానాలు కొనసాగుతున్నాయి. వసంత పంచమి సందర్భంగా చివరి సాహీ స్నానాలను భక్తులు ఆచరిస్తున్నారు. వివిధ పీఠాలకు, అఖాడాలకు చెందిన సాధు సంతులు ఈ రోజు పవిత్ర స్నానాలు సాగించనున్నారు. కుంభమేళా స్థలం వద్ద విస్తృత స్థాయిలో భద్రతను ఏర్పాటు చేశారు. ఈ రోజు దాదాపు రెండు కోట్లమంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు చేసే అవకాశం ఉందని ప్రయాగ్ రాజ్ మేళా అధికారులు చెబుతున్నారు.