ప్రధానమంత్రి నరేంద్రమోదీ హార్యాణాలోని కురుక్షేత్రలో ఈ రోజు పలు అభివృద్ధి పనులకు, ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్యాణాలోని కురుక్షేత్రలో ఈ రోజు పలు అభివృద్ది కార్యక్రమాలకు, ప్రాజెక్టులకు శంఉస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఝజార్‌ జిల్లా బాడ్ణ్‌లో జాతీయ క్యాన్సర్‌ సంస్థను ఆయన ప్రారంభిస్తారు. ఆధునాతన సౌకర్యాలతో నిర్మించిన ఆ క్యాన్సర్‌ ఆసుపత్రిలో 700 పడకల సదుపాయంతో పాటు రోగులకు, అటెండెంట్లకు, డాక్టర్లకు ప్రత్యేక గదులు కూడా నిర్మించడం జరిగింది. ఫరిదాబాద్‌లో నిర్మించిన ఉద్యోగుల రాజ్యభీమా సంస్థ (ఇ.ఎస్‌.ఐ.) ఆసుపత్రిని, మెడికల్‌ కాలేజీని కూడా ప్రధానమంత్రి ఈ రోజు ప్రారంభిస్తారని అధికార ప్రకటనలో తెలిపారు. ఉత్తర భారతదేశంలో అది మొట్టమొదటి ఇ.ఎస్‌.ఐ. వైద్య కలశాల, బోధన ఆసుపత్రి అని తెలియజేశారు. ఇ.ఎస్‌.ఐ. లబ్దిదారులకు,  కార్మికులకు వారి కుటుంబాలకు ఈ ఆసుపత్రి ద్వారా అమూల్యమైన సేవలు లభిస్తాయి.  పంచ్‌కులాలో శ్రీ మాతా మానసదేవి ఆలయ సముదాయం వద్ధ నిర్మించే జాతీయ ఆయుర్వేద సంస్థకు ప్రధానమంత్రి శంకుస్తాపన చేస్తారు. ఆయుర్వేద వైద్య విద్యకు పరిశోధనకు, చికిత్సకు ఒక జాతీయ సంస్థగా దీన్ని నెలకొల్పుతున్నారు. కురుక్షేత్రలో శ్రీ క్రిష్ణ ఆయూష్‌ యూనివర్శీటీకి కూడా ప్రధానమంత్రి శంకుస్థాన చేస్తారు. యూనివర్శీటీ హార్యాణాలోనే కాక మొత్తం దేశంలోని భారతీయ వైద్య విధానంలో తొలి యూనివర్శిటీ అవుతుంది. కర్ణాల్‌లో పండిట్‌ దీనాదాయాల్‌ ఉపాధ్యాయే ఆరోగ్య శాస్త్రాల విశ్వవిద్యాలయానికి కూడా ప్రధానమంత్రి శంకుస్థాన చేస్తారు. పానిపట్‌లో పనిపట్‌ యేద్ధాల మ్యూజియంకు నరేంద్రమోదీ శంకుస్థాపన చేస్తారు. పానిపట్‌ యుద్ధ వీరుల గౌరవార్ధం ఆ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. స్వఛ్ఛ్‌ శక్తి – 2019 కార్యక్రమంలో పాల్గొని ప్రధానమంత్రి స్వఛ్ఛ్‌ శక్తి పురస్కారాలు ప్రధానం చేస్తారు. కురుక్షేత్రలో స్వచ్ఛ సుందర శౌచాలయ ప్రదర్శనను సందర్శిస్తారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మహిళ సాధికారిత లక్ష్యంగా నిర్వహిస్తున్న స్వఛ్ఛ శక్తి కార్యక్రమం జాతీయ స్థాయి సభకు దేశ వ్యాస్తంగా మహిళ పంచులు, సర్పంచులు హాజరవుతారు.