పాకిస్తాన్ మళ్లీ అదే రీతిలో…

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లా అదే రీతిలో వ్యవహరించారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారతదేశంలోని మైనారిటీల జీవనశైలిపై మళ్లా వ్యాఖ్యలు విసిరారు. పాకిస్తాన్ చేసిన ఈ వ్యాఖ్యలు భారతీయులను కించపరిచేలా ఉన్నాయి. అంతేకాదు భారతదేశంలో ప్రజల మతసామరస్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి.  పాకిస్తాన్ ఈ రకమైన వ్యాఖ్యల సరళి అన్ని మతాల విశ్వాసాల వారినీ కించపరిచేలా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ లాంటి దేశ ప్రభుత్వాధిపతి నుంచి రావడం మరింత శోచనీయం.

భారత ప్రభుత్వంతో పాటు భారతీయులందరూ కూడా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. భారత విదేశాంగ వ్యవహారాల శాఖ  దీనిపై ప్రతిస్పందిస్తూ ‘ పాక్ ప్రధాని మరోసారి భారత లౌకిక రాజ్యతత్వం, నియమాల పట్ల తన అవగాహనా రాహిత్యాన్ని ప్రదర్శించారు’ అని విమర్శించింది. అంతేకాదు అన్ని మతాలకు చెందిన వారూ ప్రజాస్వామిక పాలనలో కలిసి జీవిస్తారు, అన్ని రకాల విశ్వాసాలను గౌరవిస్తారన్న విషయాల పరంగానే కాకుండా ప్రగతిశీలకమైన భారత రాజ్యాంగం గురించి ఖాన్‌కు అవగాహన లేద’ని భారత మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది.  అంతేకాదు ‘తాను ఎదుర్కొంటున్న అంతర్గత సమస్యలపై పాకిస్తాన్ దృష్టిసారిస్తే మంచిదని విమర్శించింది. అంతేకాదు పాక్ ప్రజల దృష్టిని ఇతర అంశాలపై తిప్పడానికి ప్రయత్నించే బదులు దేశంలో వారి జీవనపరిస్థితులు మెరుగుపరచడంపై దృష్టి పెట్టాల’ని అభిప్రాయపడింది.

పాకిస్తాన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు పట్టించుకోకుండా దాచిపెట్టేవి కావు. భారతదేశం పట్ల పాక్ అజ్ఘానాన్ని ఆ వ్యాఖ్యలు బయటపెడుతున్నాయి. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అవగాహనరాహిత్యాన్ని ఆ వ్యాఖ్యలు స్పష్టంగా అద్దంపడుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ క్రికెటర్‌గా ఒకప్పుడు ఎందరినో మెప్పించిన గొప్ప వ్యక్తి అని భారతీయులకు తెలుసు. క్రికెట్ క్రీడలో భాగంగా ఇమ్రాన్ పలుమార్లు భారత్‌లో పర్యటించారు కూడా. ఏ దేశానికి చెందిన వారు అన్న తేడాపాడాలతో సంబంధం లేకుండా అన్ని దేశాలకు చెందిన క్రీడాకారులంటేను భారతీయులకు ఎంతో గౌరవం. అందుకే ఇమ్రాన్ ఖాన్ అసంబద్ధ వ్యాఖ్యలు సహజంగానే ఎందరో భారతీయులను బాధించాయి.

మతాన్ని బట్టి మైనారిటీలకు తమ దేశంలో స్థానం ఇవ్వని పాకిస్తాన్ దీని గురించి మొదట ఆలోచించాలి. పాకిస్తాన్‌లోని మైనారిటీ కమ్యూనిటీల దుస్థితి ప్రపంచానికి తెలుసు. వారు మెజారిటీ ప్రజలకు మల్లే జీవించాలి. కానీ అలాంటి పరిస్థితులు అక్కడ లేవు. ఆ దేశ సమాజంలో కూడా వారికి తగిన స్థానం లేదు. ‘మైనారిటీ’ అనే పదానికి పాకిస్తాన్‌లో ఎన్నో అర్థాలు ఉన్నాయి. ‘మైనారిటీ’ అంటే మతపరమైంది కావచ్చు. భాషా పరమైంది కావచ్చు. జాతిపరమైంది కావొచ్చు. చివరికి పాకిస్తాన్‌లో  వారి వస్త్రధారణ బట్టి సైతం మైనారిటీలుగా భావించే పరిస్థితి ఉంది.

తనంటే ఎంతో ఇష్టపడే జియా ఉల్ హక్ పాకిస్తాన్‌లో మహిళలు స్త్రీలు ధరించడానికి వీలు లేందంటూ నిషేధం విధించడం ఖాన్‌కి గుర్తుండే ఉంటుంది. అలాగే జరిగింది కూడా. పాకిస్తాన్ ప్రెసిడెంట్ జనరల్ జియా ఉల్ హక్ ‘చీరలు విదేశీ వస్త్రధారణ’ అని భావించారు. ఈ ఫత్వాని వ్యతిరేకిస్తూ అప్పట్లో పాకిస్తాన్ అంతటా పెద్ధ ఎత్తున ప్రదర్శనలు వెల్లువెత్తాయి.

భాషాపరమైన మైనారిటీలైన సింధీలు, బెలోచీస్‌లకు దేశ అభివృద్ధి ఎజెండాలో చోటే లేదు. పంజాబ్-సింధుల మధ్య శత్రుత్వం అనేది ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. సింధీ భాష  ప్రపంచంలోనే ఎంతో పురాతనమైన భాష. వీరు ఎన్నో ఏళ్లుగా వివక్షకు గురవుతున్నారు.

బెలోచ్ విషయంలోనూ ఇదే సమస్య. బెలూచీలు తమని తాము పాకిస్తానీయులుగా భావించరు. దాంతో పాకిస్తాన్ ప్రభుత్వంకు బెలూచీలంటే అస్సలు పడదు.

గత ఏడాది ఆసియా బీబీని విడుదల చేసిన నేపథ్యంలో రెండు జంటనగరాలైన ఇస్లామాబాద్-రావల్‌పిండిలను చుట్టుముట్టినపుడు మతఛాందస సంస్థ ‘తెహ్రీక్-ఇ-లబ్బాయిక్-పాకిస్తాన్’కి తన ప్రభుత్వం ఎందుకు లొంగిపోయిందో ఇమ్రాన్ ఖాన్ ప్రపంచానికి వివరించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్రిస్టియన్ మహిళ ఆసియా బీబీ దైవదూషణానికి పాల్పడిందన్న ఆరోపణల మీద దశాబ్దకాలంపైగా జైలులో నిర్బంధంలో ఉంది. దీనిపై రెండు వారాల క్రితం రివ్యూ పిటిషన్‌ని జైలు నుంచి ఆమె విడుదలకి వ్యతిరేకంగా వేశారు. దాన్నిపాకిస్తాన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. భద్రత దృష్ట్యా వేరే దేశంలో ఆమె, ఆమె కుటుంబసభ్యులు ఆశ్రయం కోరే అవకాశం ఉందనే వార్తు కూడా వచ్చాయి. పాకిస్తాన్‌లో ఆమె భద్రతకు భరోసా లేని పరిస్థితి ఉంది. ఆసియా బీబీ తరపున వాదించిన న్యాయవాది గత ఏడాదిగా నెదర్‌లాండ్స్‌ లో ఆశ్రయం పొందుతున్నారు. తన క్లయింట్‌ తరపున నిలిచినందుకు గాను పాకిస్తాన్‌లోని మతఛాందస సంస్థలు, వ్యక్తుల నుంచి ఆ న్యాయవాదికి ప్రాణభయం ఉండడమే ఇందుకు కారణం.

అందుకే పాకిస్తాన్ పేలవమైన వ్యాఖ్యలను కొట్టివేయాలి. భారతదేశం ప్రజాస్వామ్య విలువల పునాది మీద, సమానత్వం, సౌభ్రాతృత్వం విలువల ప్రాతిపదికగా ఏర్పడిన దేశం. ఈ దేశంలో ప్రతి పౌరుడికి తన మతాన్ని గౌరవించే, తన మత నియమాలను, పూజలను పాటించే, అనుసరించే హక్కు సంపూర్ణంగా భారత రాజ్యాంగం ఇచ్చింది. భాషా పరంగా, ఆహారపు అలవాట్లకు సంబంధించి, వస్త్రధారణకు సంబంధించి ఏ మతం వాళ్లూ భారత దేశంలో వివక్షకు గురికారు. ఇమ్రాన్ ఖాన్‌కు కూడా ఈ విషయం స్పష్టంగా తెలుసు. కానీ క్రూరమైన రాజకీయ వైఖరులు పాకిస్తాన్ రాజకీయ స్వభావాన్ని మార్చివేశాయి. అతన్ని కూడా భారత వ్యతిరేకిగా చేశాయి.

ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రభుత్వ అధికార పగ్గాలు చేపట్టి ఒక సంవత్సరం అవుతోంది. ఎన్నికల సమయంలో పాక్ ప్రజలకు ఖాన్ ఇచ్చిన ‘నయా పాకిస్తాన్’ మాటలు నీటి మూటలయ్యాయి. ఆ దిశగా ఎలాంటి చర్యలూ చేపట్టిన దాఖలా లేదు. అంతేకాదు పాక్‌కు ఎప్పటినుంచో మిత్రదేశాలుగా ఉన్న అమెరికా లాంటివి కూడా నేడు ఇస్లామాబాద్‌ను లెక్కచేయని పరిస్థితిని చూస్తున్నాం. తన ఆర్థిక అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు పాకిస్తన్ ఇపుడు సౌదీ అరేబియా, యుఎఇ, చైనా వంటి దేశాల చేతుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా భారత్‌కు వ్యతిరేకంగా రాజకీయాలు నెరపడంలో పాక్ శైలిలో ఇసుమంత మార్పు లేదు.

‘ గాజు ఇళ్లల్లో ఉన్న వారు ఇతరులపై రాళ్లు విసరరాదు’ అనే సూక్తిని ఇమ్రాన్ ఖాన్ లాంటి వాళ్లు మర్చిపోకుండా బాగా గుర్తుంచుకోవాలి.

రచన: కౌశిక్ రాయ్, ఎఐఆర్: వ్యూహాత్మక వ్యవహారాల విశ్లేషకులు