ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చే ప్రకటనలలో రక్షణ సిబ్బంది ఫోటోలను ప్రచురించకుండా తమ నాయకులు, అభ్యర్థులను ఆదేశించాలని ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలను కోరింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చే ప్రకటనలలో రక్షణ సిబ్బంది ఫోటోలను ప్రచురించకుండా తమ నాయకులు, అభ్యర్థులను ఆదేశించాలని  ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలను కోరింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు లేఖలు రాసింది.  రాజకీయ ప్రచారంలో భాగంగా  కొన్ని పార్టీలు రక్షణ సిబ్బంది ఫోటోలను  వాడుకుంటున్న విషయాన్ని వారి దృష్టికి తీసుకొచ్చింది. 2013 సలహాను కమిషన్ ప్రస్తావిస్తూ   ఈ విష‌యం తెలిపింది.