ఉగ్ర‌వాదంపైన అన్ని దేశాలు వెంట‌నే ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ పిలుపునిచ్చారు.

ఉగ్ర‌వాదంపైన అన్ని దేశాలు వెంట‌నే ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ పిలుపునిచ్చారు. ప్ర‌ధాన‌మంత్రి నిన్న ట‌ర్కీ దేశాధ్య‌క్షుడు రిసిప్ త‌య్య‌బ్ ఎర్డోగాన్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఉగ్ర‌వాదం ప్ర‌పంచ శాంతి భ‌ద్ర‌త‌ల‌కు పెను ప్ర‌మాదంగా ప‌రిణ‌మించింద‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. అబుద‌బీ యువ‌రాజు షేక్ మ‌హ‌మ్మద్ బిన్ జాయెద్ అల‌ న‌య‌న్‌తో కూడా ప్ర‌ధాన‌మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. స‌మ‌గ్ర వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని మ‌రింత ప‌టిష్ట‌ప‌రుచుకోవాల‌ని ఇరువురు నేత‌లు నిర్ణ‌యించారు. సౌదీ అరేబియా విదేశాంగ సహాయ మంత్రి అదెల్ బిన్ అల్ జుబెయిర్ నిన్న న్యూఢిల్లీలో మోదీని కలుసుకున్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ పట్ల సంఘీభావం ప్రకటించినందుకు ప్రధానమంత్రి సౌదీ అరేబియాకు ధన్యవాదాలు తెలియచేశారు.