పాకిస్థాన్ త‌న భూభాగంలో ప‌నిచేస్తున్న ఉగ్ర‌వాద ముఠాల‌ను నిర్మూలించ‌డానికి ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని bharat america ఉమ్మ‌డిగా పిలుపునిచ్చాయి.

పాకిస్థాన్ త‌న భూభాగంలో ప‌నిచేస్తున్న ఉగ్ర‌వాద ముఠాల‌ను నిర్మూలించ‌డానికి ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భారత్, అమెరికా ఉమ్మ‌డిగా పిలుపునిచ్చాయి. వాషింగ్ట‌న్‌లో గ‌త సాయంత్రం భార‌త విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి విజ‌య్ గోఖ‌లే – అమెరికా విదేశాంగ మంత్రి మైఖేల్ పాంపీల మ‌ధ్య జ‌రిగిన స‌మావేశంలో ఆ మేర‌కు ఇరుదేశాల మ‌ధ్య ఒక అంగీకారం కుదిరింది. ఉగ్ర‌వాదాన్ని ఏ రూపంలోనైనా స‌మ‌ర్థించేవారంతా కూడా ఉగ్ర‌వాదానికి సంబంధించి జ‌వాబుదారులే అవుతార‌ని ఇరుదేశాలు అంగీక‌రించిన‌ట్లు ఒక అధికార ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.