లోక్‌స‌భ ఎన్నిక‌లు ప్ర‌క‌ట నతో రాజ‌కీయ కార్య‌క‌లాపాలు దేశ‌వ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి.

లోక్‌స‌భ ఎన్నిక‌లు ప్ర‌క‌టించ‌బ‌డ‌డంతో రాజ‌కీయ కార్య‌క‌లాపాలు దేశ‌వ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. వివిధ రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల వ్యూహాల‌కు తుది రూపునివ్వ‌డానికి పాటుప‌డుతున్నాయి. BJP మ్యానిఫెస్టో క‌మిటీ స‌మావేశం నిన్న న్యూఢిల్లీలో జ‌రిగింది. క‌మిటీ అధ్య‌క్షుడు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు. ర‌క్ష‌ణ శాఖ మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ కూడా స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశం ఈరోజు గుజ‌రాత్‌లో గాంధీ న‌గ‌ర్‌లో జ‌రుగుతుంది. 6 పార్టీల కూట‌మి పంజాబ్ డెమోక్ర‌టిక్ అలియెన్స్ లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టికీ ఏడుగురు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. పంజాబ్ ఏక్తా పార్టీ, బ‌హుజ‌న్ స‌మాజ్ వాది పార్టీ, లోక్ ఇన్సాప్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగుబాటు నాయ‌కుడు ద‌రమ్ వీర్ గాంధీ నేతృత్వంలో ఏర్ప‌డిన పంజాబ్ మంచ్, CPI రివ‌ల్యూయష‌న‌రీ మార్కిస్ట్ పార్టీ ఇప్ ఇండియా పంజాబ్ డెమోక్ర‌టిక్ అలియ‌న్స్‌లో ఉన్నాయి. ఇదిలాఉండ‌గా త‌మిళ‌నాడులో AIADMK అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ ప్రారంభించింది. కేర‌ళ‌లో అధికార LDF ఇంటింటి ప్రచారం, సోష‌ల్ మీడియా ప్రచారం ప్రారంభించింది.