గుజరాత్ లోని ధ్రాంగ్దరా, మనవాదర్, జామ్ నగర్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

గుజరాత్ లోని ధ్రాంగ్దరా, మనవాదర్, జామ్ నగర్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వచ్చే నెల 23వ తేదీన పోలింగ్ జరగనున్న ఈ ఉపఎన్నికలకు ఈ నెల 28వ తేదీన నోటిఫికేషన్ వెలువడుతుంది. మే నెల 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పర్సోత్తమ్ సపారియా, జవహర్ చావ్దా, వల్లభ్ ధారవీయ రాజీనామాలతో ఈ ఉపఎన్నికలు అవసరమయ్యాయి. వారు కాంగ్రెస్ పార్టీని వీడి,… భారతీయ జనతా పార్టీలో చేరినందున తమ MLA పదవులకు రాజీనామా చేశారు.