న్యూజిలాండ్‌లో శుక్ర‌వారం ప్రార్థ‌న‌ల సంద‌ర్భంగా రెండు మ‌సీదుల వ‌ద్ద ఒక సాయుధ‌డు జ‌రిపిన కాల్పుల్లో క‌నీసం 40 మంది మ‌ర‌ణించారు.

న్యూజిలాండ్‌లో శుక్ర‌వారం ప్రార్థ‌న‌ల సంద‌ర్భంగా రెండు మ‌సీదుల వ‌ద్ద ఒక సాయుధ‌డు జ‌రిపిన  కాల్పుల్లో క‌నీసం 40 మంది మ‌ర‌ణించారు. వాటిలో ఒక‌టైన అల్‌నూర్ మ‌సీదు వ‌ద్ద చాలా మంది చ‌నిపోయిన‌ట్లు వార్తలందాయి. ఆ మ‌సీదుల‌ను ఖాళీ చేయించారు. ఈ మార‌ణ కాల్పుల‌కు సంబంధించి న్యూజిలాండ్ పోలీసులు న‌లుగురిని అదుపులోకి తీసుకుని అనేక ప్రేలుడు ప‌దార్థాల‌ను స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు జ‌రిపిన వ్య‌క్తి కోసం పోలీసులు గాలిస్తున్నందున‌, ఆ న‌గ‌రంలో రాక‌పోక‌ల‌ను నిలుపు చేశారు. త‌మ దేశంలో అత్యంత విషాద దినాల‌లో ఈ కాల్పులు ఒక‌టని న్యూజిలాండ్ ప్ర‌ధాని జ‌సిండా ఆర్డెన్ అన్నారు. ఈ దాడిని ఖండిస్తూ న్యూజిలాండ్‌లో అలాంటి తీవ్ర‌మైన‌, గ‌తంలో జ‌ర‌గ‌ని హింసాకాండ చ‌ర్య‌ల‌కు తావులేద‌ని ఆయ‌న అన్నారు.