ఈ రోజు రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్‌ అనేక మందికి పద్మ పురస్కారాలు అందచేశారు.

ఈ రోజు రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్ అనేక మందికి పద్మ పురస్కారాలు అందచేశారు.  ఛ‌త్తీస్‌గ‌ఢ్ జానపద గాయని తీజాన్ బాయ్  కి పద్మ విభూషణ్, శాస్త్రవేత్త నంబి నారాయ‌ణ్ కి ప‌ద్మ భూష‌ణ్‌ ఇచ్చారు. నటుడు మ‌నోజ్ బాజ్‌పేయీ, క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్, బాస్కెట్ బాల్  క్రీడాకారిణి ప్ర‌శాంతి సింగ్‌, ఫుట్‌బాల‌ర్ సునీల్ ఛ‌త్రీ, పర్వతారోహకురాలు బ‌చేంద్రీపాల్‌ మొదలైన వారు ప‌ద్మ‌శ్రీ‌ పురస్కారాలు అందుకున్నారు. ఈ ఏడాది 112 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేశారు.