ఎన్నికల నిఘాపై ఎన్నికల క‌మిష‌న్ సమావేశం జరిపింది. ధనబలం, దౌర్జన్యం లేకుండా సజావుగా ఎన్నికలు నిర్వహించే విషయం చర్చించారు.

ఎన్నికల నిఘాపై ఎన్నికల క‌మిష‌న్  సమావేశం జరిపింది. ధనబలం, దౌర్జన్యం లేకుండా సజావుగా ఎన్నికలు నిర్వహించే విషయం చర్చించారు. ఇందుకు సంబంధించి ఎన్నికల కమీషన్ నిన్న న్యూఢిల్లీ లో అన్ని శాఖల సమన్వయ కమిటీ సమావేశాన్ని  నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమీషనర్ సునీల్ అరోరా మాట్లాడుతూ ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించడం రాజ్యాంగ పరంగా తప్పనిసరి విధి అని పేర్కొన్నారు. ప్రత్యేకంగా ధన శక్తి, ఓటర్లను ప్రేరేపిస్తున్న నేపథ్యంలో  సజావుగా ఎన్నికలు నిర్వహించడం ఒక పెద్ద సవాలుగా పరిణమించిందని ఆయన అన్నారు. ఈ మహమ్మారిని అరికట్టడానికి ఎన్నికల కమిషన్ నడుంకట్టిందనీ ఇందుకోసం అభ్యర్థులు, రాజకీయ పార్టీలు చేసే ఎన్నికల వ్యయాన్ని పర్యవేక్షించేందుకు అవసరమైన మార్గదర్శక సూత్రాలను జారీ చేశామనీ అరోరా చెప్పారు.