ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 9 లోక్‌స‌భ స్థానాల‌లో పోటీచేసే అభ్య‌ర్థుల‌ను వై.ఎస్.ఆర్‌. కాంగ్రెస్‌పార్టీ ప్ర‌క‌టించింది.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ 9 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.  పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన సమీప బంధువు YS  అవినాష్ రెడ్డి ని కడపనుంచి మరో సారి పోటీకి నిలిపారు.  అవినాష్ రెడ్డి 2014 ఎన్నికల్లో కడప నుంచి గెలుపొందారు. రాజంపేట్ నియోజకవర్గం నుంచి మిథున్ రెడ్డి తిరిగి పోటీ చేస్తున్నారు.  మిగిలి ఏడు నియోజక వర్గాలకు కొత్త‌వారిని ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో 175 శాస‌న‌స‌భ స్థానాల‌కు, 25 లోక్‌స‌భ స్థానాల‌కు వ‌చ్చే నెల 11న ఎన్నిక‌లు జ‌రుగుతాయి.