తొలివిడ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల‌లో పోటీ చేసే అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నిక‌ల క‌మిటీ కొత్త ఢిల్లీలో స‌మావేశం జ‌రుపుతుంది.

తొలివిడ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల అత్య‌ధిక అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నిక‌ల క‌మిటీ కొత్త ఢిల్లీలో స‌మావేశం జ‌రుపుతోంది. పార్టీ ప్ర‌ధాన కార్య‌ల‌యంలో ఈ స‌మావేశానికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ, పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు సుష్మాస్వ‌రాజ్‌, రాజ్‌నాథ్ సింగ్‌, అరుణ్‌జైట్లీ, కిర‌ణ్ రిజిజు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. 91 స్థానాల‌కు వ‌చ్చేనెల 11న జ‌రిగే తొలివిడ‌త ఎన్నిక‌ల‌కు ఈ అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేస్తున్నారు. 543 పార్ల‌మెంట‌రీ స్థానాల‌కు మే 19వ తేదీ వ‌ర‌కు జ‌రిగే 7 విడ‌త‌ల ఎన్నిక‌ల‌లో ఓట్ల లెక్కింపు మే 23న జ‌రుగుతుంది.