పోలింగ్‌కు 48 గంట‌ల‌ముందు రాజ‌కీయ పార్టీలు మ్యానిఫెస్టో విడుద‌ల చేయ‌డాన్ని ఎన్నిక‌ల సంఘం నిషేధించింది.

రాజ‌కీయ పార్టీలు పోలింగ్‌కు ముందు 48 గంట‌ల‌లో ఎన్నిక‌ల మ్యానిఫెస్టో విడుద‌ల చేయ‌డాన్ని ఎన్న‌కి సంఘం నిషేధించింది. ఎన్నిక‌లు ప్ర‌క‌టించాక ఆయా రాజ‌కీయ పార్టీలు అనుస‌రించ‌వ‌ల‌సిన ప్ర‌త్యేక నియ‌మావ‌ళి నిబంధ‌న‌ల‌లో భాగంగా ఈసీ ఈ నిషేధం విధించింది. ఒకే విడ‌త‌లో ఎన్నిక‌లు జ‌రిగే ప‌క్షంలో 1951 ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టంలోని సెక్ష‌న్ 126 ప్ర‌కారం నిషిద్ధ స‌మ‌యంలో మ్యానిఫెస్టో విడుద‌ల చేయ‌రాదు. ఒక‌వేళ అనేక విడ‌త‌లుగా ఎన్న‌కలు జ‌రిగే పక్షంలో నిషిద్ధ కాలంలో మ్యానిఫెస్టో విడ‌ద‌ల చేయ‌వ‌చ్చున‌ని స‌ర‌వించిన ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి పేర్కొంటున్న‌ది. ఈ నిబంధ‌న ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిలో భాగంగా రాబోయే అన్ని ఎన్నిక‌ల‌కు వ‌ర్తిస్తుంది.