మాల్దీవుల‌లో 2 రోజుల ప‌ర్య‌ట‌న‌కై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ బ‌య‌లుదేరివెళ్ళారు.

విదేశీ వ్య‌వ‌హారాల మంత్రి సుష్మాస్వ‌రాజ్‌ రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌కు ఈరోజు మాల్దీవుల‌కు  బ‌య‌లుదేరి వెళ్ళారు. ఆమెతోపాటు విదేశాంగ కార్య‌ద‌ర్శి విజ‌య గోఖ‌లే, ఇత‌ర అధికారులు వున్నారు. ఆమె ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా స్వ‌రాజ్ మాల్దీవుల అధ్య‌క్షుడు ఇబ్ర‌హీం మ‌హ్మ‌ద్‌సోలి, పార్ల‌మెంట్ స్పీక‌ర్ ఖాసిం ఇబ్ర‌హీం, విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్‌ల‌ను క‌లుసుకుంటారు. విభిన్న అంశాల‌పై స‌హ‌కారం పై చ‌ర్చించేందుకు ఆమె సంయుక్త మంత్రిత్వ స‌మావేశం కూడా జ‌ర‌పాల్సి వుంది. భార‌త్‌కు అధ్య‌క్షుడు సోలి అధికారిక ప‌ర్య‌ట‌న‌పై అంగీక‌రించిన ఫ‌లితాల అమలుతో స‌హా కొన‌సాగుతున్న‌, భ‌విష్య‌త్ స‌హ‌కార ఏర్పాట్ల‌ను ఉభ‌య దేశాలు చ‌ర్చిస్తాయ‌ని మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ‌శాఖ పేర్కొంది. అభివృద్ధి స‌హాకారం, ఆరోగ్య రంగంలో స‌హ‌కారం, ప్ర‌జ‌ల మ‌ధ్య సంబంధాల‌ను పెంపొందించ‌డంపై చ‌ర్చ‌లు జ‌రుగుతాయ‌ని పేర్కంది. అధ్య‌క్షుడు సోలి నాయ‌క‌త్వం అధికారం చేప‌ట్టాక రెండు పొరుగుదేశాల మ‌ధ్య సంబంధాలు ఎంతగానో మెరుగయ్యాయి. గ‌త న‌వంబ‌ర్‌లో సోలి ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ హాజ‌ర‌య్యారు.