విదేశాంగ‌శాఖ మంత్రి సుష్మాస్వ‌రాజ్ ఈ రోజు నుంచి రెండు రోజుల‌పాటు మాల్దీవుల‌లో ప‌ర్య‌టిస్తారు. వివిధ అంశాల‌లో స‌హ‌కారంకోసం సంయుక్త మంత్రిత్వ స‌మావేశం నిర్వ‌హిస్తారు.

విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ నేటి నుంచి రెండు రోజుల పాటు మాల్దీవుల్లో పర్యటిస్తారు. ఆమెతో పాటు విదేశాంగ కారార్యదర్శి  విజయ్ గోఖలేతో కూడిన ఉన్నత స్థాయి  ప్రతినిధి బృందం మాల్దీవులకు వెళుతుంది. ఈ పర్యటన సందర్భంగా  మంత్రి మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలీహ్, పార్లమెంట్ స్పీకర్ ఖాసీం ఇబ్రహీం , మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ ను కలుసుకుంటారు.  వివిధ రకాల సమస్యలపై  సహకారం గురించి సమావేశంలో స్వరాజ్  చర్చిస్తారు. అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలీహ్ భారత పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందం అమలుతో సహా ప్రస్తుతం కొనసాగుతోన్న, భవిష్యత్ సహాయ సహకారాల ఏర్పాట్లపై రెండు ప్రభుత్వాలు చర్చిస్తామని మాల్దీవుల విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.