ఉగ్రవాదంపై చైనా వాస్తవ విధానాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది

జైష్-ఇ-మొహమ్మద్ (జెఇఎం) చీఫ్ మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీ 1267 కింద అంతర్జాతీయ ఉగ్రవాద జాబితాలో  చేర్చాలన్న ప్రయత్నాలను సాంకేతిక కారణాలు చూపుతూ నాల్గవసారి చైనా మోకాలొడ్డిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్ ఈ ప్రతిపాదనను చేపట్టాయి. ఇది అంతర్జాతీయంగా భారత్‌కు ఉన్న మద్దతును వెల్లడిస్తోంది. భారత్ అంతర్జాతీయంగా చేపట్టిన దౌత్య ప్రయత్నాలను తెలుపుతోంది. అంతేకాదు ఈ ప్రయత్నం ద్వారా పాకిస్తాన్‌కు  చైనా నుంచి అందుతున్న మద్దతును కూడా బహిర్గతం చేసింది. ఈ ప్రతిపాదనకు నాల్గవ పర్యాయం సైతం చైనా అంగీకరించకపోవడానికి గల హేతుబద్ధ కారణాలను వివరించాలంటూ దానిపై తీవ్ర ఒత్తిడిని సైతం తెచ్చింది.

ఈ సమస్య పరిష్కారానికి భారత్, చైనాలు లోతుకంటా చర్చలు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చైనా రాజకీయ నిపుణులు, వ్యాఖ్యాతలు అభిప్రాయపడుతున్నారు. జెఇఎం చీఫ్ విషయంలో భారత్ బలమైన సాక్ష్యాధారాలను  ముందుపెట్టినప్పటికీ, చైనా మరిన్ని సాక్ష్యాధారాలు ఇవ్వాల్సిందిగా భారత్‌ను కోరడం మరో పర్యాయం ఓటింగ్ ప్రక్రియకు వెళ్లే ముందర ఈ విషయంపై బీజింగ్ యొక్క గందరగోళ వైఖరిని విస్పష్టంచేస్తోంది. సాంకేతిక కారణాలతోపాటు ఉగ్రవాదులకు  పాక్‌ ఆశ్రయం ఇస్తోందన్న నింద ఆ దేశంపై పడడం చైనాకు ఇష్టం లేదని స్పష్టమవుతోంది. తన చర్యలపై అంతర్జాతీయంగా వెల్లువెత్తిన వ్యతిరేకత నేపథ్యంలో వస్తున్న ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు ఇస్లామాబాద్ చైనాపై ఆధారపడింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తోందన్న పేరు దానికి రాకూడదని చైనా కోరుకుంది. దీంతో సహజంగానే ఉగ్రవాద సమస్య పరిష్కారానికి సంబంధించి భారత్, పాకిస్తాన్లవి రెండు భిన్నమైన పోకడలు . వీటి  రెండింటివీ రెండు భిన్నమైన మార్గాలు కూడా. దీంత ఆయా దేశాలలో ఉగ్రచర్యలను, ఉగ్రమార్గాలను నిరోధించడంతోపాటు ఉగ్ర బృందాలు, ఆయా దేశాలు అనుసరిస్తున్న దాడులను అడ్డుకోవచ్చు.

 ఉగ్రవాదులను, ఉగ్ర బృందాలను అణచేసేందుకు భారత్ అనుసరిస్తున్న విధానంపై చైనా కొనసాగిస్తూ వస్తున్న తటస్థ విధానం నేడు పాకిస్తాన్‌తో చైనా స్నేహ సంబంధాలను సంకటంలో పడేస్తున్నాయి. ఫలితంగా భారత-చైనా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. వీటి మధ్య పరస్పర అవిశ్వాసం పెరిగింది. అంతేకాదు అంతర్జాతీయ ఉగ్రవాదంకు సంబంధించిన కొన్ని అంశాల పరంగా రెండు దేశాల మధ్య సహకార నిబద్ధతకు సంబంధించి కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత, చైనాలు రెండూ పలు అంతర్జాతీయ వేదికల్లో సభ్యులు. అన్ని వేదికలపై ఉగ్రవాదంపై తీవ్ర చర్యలు చేపడతామంటూ బీజింగ్ మాట ఇచ్చింది కూడా. ఇటీవల ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో చేపట్టిన తీర్మానంపై చైనా వ్యతిరేక ఓటుతో అంతర్జాతీయ వ్యవస్థలో బాధ్యతాయుతమైన భాగస్వామిగా చైనా ‘ఇమేజ్’కి  బీటలు పడింది.

చైనా మీద వస్తున్న అంతర్జాతీయ ఒత్తిడితో పాటు  ఆ దేశం తీసుకున్న నిర్ణయం భారత్‌ను ఎంతో నిరాశకు గురిచేసింది.  ఇది ఉగ్రవాద పోరులో చైనా విధానానికి సంబంధించి పలు ఆందోళనలను సైతం లేవనెత్తుతోంది. భారత్‌లోని చైనా రాయబారి లు ఝఓహీ మాట్లాడుతూ మసూద్ అజర్ విషయం త్వరలోనే పరిష్కారమవుతుందంటూ ప్రకటించారు. అంతేకాదు న్యూఢిల్లీ, బీజింగుల మధ్య మరొక పర్యాయం విస్తృత చర్చలు చోటుచేసుకుంటాయనే ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు. సమస్య పరిష్కారానికి ఈ రెండు దేశాల మధ్య చర్చలు కీలకమైనవని  అభిప్రాయపడ్డారు. చైనా చేపడుతున్న చర్యలను లోతుకంటా భారత్ పరిశీలిస్తున్న తరుణంలోనే చైనా, భారత్‌ల మధ్య పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయంటూ చైనా రాయబారి ఆశావహంగా పునరుద్ఘాటించడం విశేషం. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సభ్యులు చైనా వైఖరికి మండిపడుతూ తాము ఆ దేశంపై ఇతరత్రా చర్యలను చేపట్టాల్సి పరిస్థితులు వస్తాయంటూ హెచ్చరించాయి కూడా.

అంతర్జాతీయంగా చైనాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో భారత్‌తో సంప్రదింపులు చేయాల్సిన పరిస్థితి చైనాకు ఎదురైందన్న దాంట్లో ఎలాంటి సందేహాలు లేవు. పాకిస్తాన్‌తో చైనా స్నేహం ప్రశ్నార్థకంలో పడింది. తన మిత్రదేశాన్ని కాపాడుకునేందుకు చైనా ఎంత దూరమైన వెడుతుందనే విషయం ఈ సంఘటనతో ప్రపంచంలోని అన్ని దేశాలకూ స్పష్టమైంది. పాకిస్తాన్‌తో చైనా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు పాక్‌ను చైనా కాపాడుతోంది. ఆ దేశంలో తను పెట్టిన విస్తృత పెట్టుబడులను కాపాడుకుంటోంది. భారత్‌కు చైనా పలుకుతున్న మద్దతు తాత్కాలికమైందా లేదా వాస్తవమైందా అన్న విషయంపై పలువురు సందేహాలను వ్యక్తంచేస్తున్నారు. ఇందులో చైనా నిజాయితీగా వ్యవహరిస్తే, మరిన్ని కొత్త సాక్ష్యాలు కావాలంటూ అడగాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? భారత పశ్చిమ సరిహద్దుల్లో పెచ్చరిల్లుతున్న ఉగ్రవాదంపై చైనాను తప్పించి మిగతా అంతర్జాతీయ కమ్యూనిటీని భారత్ ఆమోదింప చేయగలిగింది. భారత దేశంలో జెఇఎం చీఫ్ మసూద్ అజర్ ఉగ్రవాదకార్యకలాపాలు నిర్వహిస్తున్నాడన్న దానిపై  మనదేశం బలమైన, విస్తృతమైన సాక్ష్యాధారాలను అంతర్జాతీయ సమాజం ముందుపెట్టింది. మరీ ముఖ్యంగా పుల్వామా దాడికి సంబంధించి సంపూర్ణ సాక్ష్యాధారాలు అంతర్జాతీయ సమాజం ముందుంచింది.

ఈ సమస్య పరిష్కారానికి మరిన్ని సాక్ష్యాధారాలు కావాలంటూ చేసిన  ప్రతిపాదనను చైనా ఎలా చూస్తుందన్న దానిపైప ఆ దేశ అంగీకారం ఆధారపడి ఉంది. ఉగ్రవాదులు, ఉగ్రసంస్థలను నిషేధించడంలో అంతర్జాతీయ కమ్యూనిటీ శక్తివంతంగా వ్యవహరించేలా భారత్ తన పరపతిని మరింత ప్రదర్శించాల్సి ఉంది. దక్షిణ ఆసియా ప్రాంతంలో పనిచేస్తున్న ఉగ్రబృందాలు, ఉగ్రవాద నెట్‌వర్కు  తీరుతెన్నులను బీజింగ్ అర్థంచేసుకోవాలి. ఇవి భారత ఉపఖండంపై దుష్ప్రభావాన్ని చూపడంతోపాటు చైనాలోని ప్రాంతాలతో కలిపి విస్తృతస్థాయిలో తీవ్ర ప్రభావాన్ని రేకెత్తిస్తాయి.

రచన: డా. ఎం . ఎస్. ప్రతిభ, చైనా వ్యవహారాల వ్యూహాత్మక విశ్లేషకులు