దోహలో ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ చివరి రోజున భారత ఒక వ్వర్ణ పతకంతో సహా నాలుగు పతకాలను సాధించింది. 2017లో తానుగెలుచుకున్న మహిళల 1500 మీటర్ల పరుగుపందెం స్వర్ణ పతకాన్ని చిత్రా విజయవంతంగా నిలబెట్టుకున్నారు. పురుషుల 1500 మీటర్ల పందెం లో అజయ్ కుమార్ సరోజ్, మహిలల 4 X 400 మీటర్ల రిలే లో భారత్ రజతపతకాన్ని సాధించినట్లు ముందు ప్రకటించినా, చైనా నిరసన తెలిపాక ఒక అథ్లెటిక్‌కు ఆటంకం కలిగిందినందుకు ఆ బృందాన్ని అనర్హులుగా జ్యూరీ ప్రకటించింది. పతకాల పట్టికలో భారత నాల్గవ స్థానంలో నిలిచింది. బిహ్రెయిన్ పట్టికలో ప్రథమ స్థానంలో నిలవగా, చైనా ద్వితియస్థానంలో, జపాన్ తృతియ స్థానంలో నిలిచాయి.