నాలుగోద‌శ‌ లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ను ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

లోక్సభ నాలుగో దశ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.  ఈ ద‌శ‌లో 9 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ నిర్వ‌హిస్తారు. పార్టీల నాయ‌కులు తమ అభ్యర్థుల గెలుపు కోసం పలు ప్రాంతాల్లో నిర్విరామంగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. బీజేపీ సీనియర్ నేత, ప్రధాని నరేంద్ర మోదీ   ఇవాళ బీహార్లోని దర్భంగా, ఉత్తరప్రదేశ్లోని బండా స్థానాల పరిధిలో ప్రచారసభల్లో ఆయన ప్రసంగించనున్నారు. అలాగే ఈ మధ్యాహ్నం వారణాసిలో ప్రధానమంత్రి రోడ్షో నిర్వహిస్తారు. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్, ఉన్నావో నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొంటారు. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజస్థాన్లోని జలోర్, అజ్మేర్, కోట నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. నిన్న ఆయన ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి, కాన్పూర్, ఉన్నావోల పరిధిలో నిర్వహించిన ప్రచారసభల్లో ప్రసంగించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇవాళ ఉత్తరప్రదేశ్లోని జలౌన్లో ప్రచారంలో పాల్గొంటారు. అలాగే బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి షాజహాన్పూర్, కనౌజ్లలో ప్రచారం పాల్గొంటున్నారు.   

నాలుగో ద‌శ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌హారాష్ట్రలో 17, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 13, రాజ‌స్థాన్‌లో 13, వెస్ట్ బెంగాల్‌లో 8, ఒడిశాలో 6,  మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఆరు, బీహార్‌లో ఐదు, జార్ఖండ్‌లో 3 నియోజ‌క‌వ్గాల్లో పోలింగ్ జ‌రుగుతుంది. ఇక  జ‌మ్మూ కాశ్మీర్ అనంత‌నాగ్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో కుల్‌గాం జిల్లాలో గ‌ల అన్ని పోలింగ్ కేంద్రాల‌లో నాలుగో ద‌శ‌లో పోలింగ్ జ‌రుగుతాయి.

71 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాలతోపాటు ఒడిషాలోని మొత్తం 147 శాస‌న‌స‌భ స్థానాలకుగాను 41 స్థానాలు ఈద‌శ‌లో పోలింగ్ జ‌రుగుతాయి. ఇలా ఉండ‌గా ఒడిశాలో 8 శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాకు స‌రోదా , బోనోయ్‌, సుంద‌ర్‌గ‌డ్‌, ద‌స్ప‌ల్ల‌, అత్తాబిర‌, బార్‌గ‌డ్‌, ప‌దంపూర్‌, బ్ర‌జ్‌రాజ్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గాల్లో 9 పోలింగ్ బూతుల్లో ఈరోజు రీ పోలింగ్ జ‌రుపుతున్నారు.  ఒక అభ్య‌ర్థి ఓటింగ్ యంత్రాన్ని ద్వంసం చేయ‌డంతో పాటు ప‌లు కార‌ణాల వ‌ల్ల   రీపోలింగ్‌కు ఆదేశించారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఆగ్రా లోక్‌స‌భ స్థానంలో ఒక బూత్‌లో ఈరోజు రీ పోలింగ్ జ‌రుపుతున్నారు. ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల‌లోని కంట్రోల్ ప్యానెల్‌పైగ‌ల ఓటింగ్‌ను ఓత్త‌డం ద్వారా పోలింగ్ త‌ర్వాత ప్రిసైడింగ్ అధికారి త‌ప్పుగా కొన్ని ఒట్లు తొల‌గించ‌డంతో ఎన్నిక‌ల సంగం అక్క‌డ రీ పోలింగ్ కు ఆదేశించింది.