బెంగ‌ళూరులో జ‌రిగిన ఐ.పి.ఎల్‌. క్రికెట్లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ పై 17 ప‌రుగులతో విజ‌యం సాధించింది.

ఐపీఎల్ క్రికెట్ టోర్న‌మెంట్‌లో భాగంగా నిన్న రాత్రి బెంగళూరులో ‘‘కింగ్స్ ఎలెవ‌న్- పంజాబ్’’ జ‌ట్టుతో మ్యాచ్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్‌- బెంగ‌ళూరు జ‌ట్టు 17 ప‌రుగుల‌తో విజ‌యం సాధించింది.   ఇప్పటివరకూ ఏడు ఓటములతో వెనుకబడి ఉన్న బెంగళూరు జట్టుకు ఇది వరుసగా మూడో విజయం కావడం విశేషం. మొత్తం 8 జట్లతో కూడిన పాయింట్ల పట్టికలో బెంగళూరు జట్టు 7వ స్థానంలో ఉన్నప్పటికీ, ప్లే-ఆఫ్ దశకు అర్హత సాధించగల అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. ప్రస్తుతం చెన్న సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.