ర‌ష్యా దేశాధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్త‌ర కొరియా నాయ‌కుడు కిమ్ జంగ్ ఎన్ వ్లాదివోస్టోక్ న‌గ‌రంలో ఈరోజు మొద‌టి శిఖ‌రాగ్ర చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

ఉత్తర  కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్, రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ల మధ్య ఈరోజు వ్లాదీవోస్తోక్ నగరంలో మొదటి శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. కొరియా పరమాణు సమస్యపై ఇరువురు నేతలు చర్చిస్తారని రష్యా తెలిపింది. కిమ్ నిన్ననే రష్యా చేరుకున్నారు. కొరియా పరమాణు ఆయుధాల కార్యక్రమంపై ఈ ఏడాది మొదట్లో హానోయ్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో జరిగిన శిఖరాగ్ర చర్చల్లో ఒక అంగీకారానికి రావడంలో జరిగిన వైఫల్యం తర్వాత కిమ్ ఇప్పుడు రష్యా సహకారం కోరతారని భావిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో కొరియా ప్రాంతంలో పరిస్థితి నిలకడగా ఉందని, రష్యా అధ్యక్షుని విదేశీ విధాన సహాయకుడు యూరీ ఊషకోవ్ చెప్పారు. సానుకూల పరిష్కారానికి రష్యా సాధ్యమైన సహాయం చేస్తుందని ఆయన చెప్పారు. ఉత్తర కొరియా పరమాణు కార్యక్రమానికి స్వస్తి చెప్పడానికి రష్యా గతంలో కూడా చర్చల్లో పాల్గొంది.

కొరియా ప్రాంతంలో ఉద్రిక్త‌త‌ల త‌గ్గించ‌డానికి ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలు పెంచ‌డానికి  పాటుప‌డుతామ‌ని పుతిన్ చెప్పారు. ఉత్త‌ర కొరియా నేత త‌మ దేశ యాత్ర ఇరు దేశాల మ‌ధ్య ఉత్త‌మ అవ‌గాహ‌న  ప‌రిస్థితుల ప‌రిష్కారానికి దోహ‌ద‌ప‌డుతాయ‌ని చెప్పారు.