న్యూఢిల్లీ డబ్ల్యుటివొ మంత్రివర్గ సమావేశం

స్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ (ఎస్ అండ్ డిటి) యంత్రాంగాన్ని తిరిగి కఠినంగా అమలు  చేసేందుకు రంగం సిద్ధమైంది. దీనికోసం డబ్ల్యుటివొ (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్)కు చెందిన పేద దేశాలు, అభివృద్ధిచెందుతున్న దేశాలు న్యూఢిల్లీలో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాయి. వివిధ అంతర్జాతీయ వాణిజ్య  ఒప్పందాలు అందిస్తున్న రాయితీలు, సౌకర్యాలను ఉపయోగించుకోవాల్సిందిగా అభివృద్ధిచెందుతున్న దేశాలకు సమావేశం  పిలుపునిచ్చింది. డబ్ల్యుటివొ పరిధిలో బహుపక్ష వాణిజ్య విధానాన్ని అభివృద్ధి చేయాలని కోరింది.  డబ్ల్యుటివొ వాణిజ్య చర్చలలో ఏర్పడ్డ ప్రతిష్ఠంభనను తొలగించేందుకు, అదే సమయంలో బహుపక్ష స్వభావాన్ని కాపాడేందుకు 22 దేశాలకు చెందిన సీనియర్ అధికారులతో సమావేశం జరిగింది. ఇందులో ఇటీవల డబ్ల్యుటివొలో చోటుచేసుకున్న పరిణామాలను బహిరంగంగా చర్చించడమే కాకుండా, అందరు సభ్యులతో కలిసి కట్టుగా పనిచేయడానికి మార్గాలను శోధిస్తోంది. తద్వరా గ్లోబల్ వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేయాలని భావిస్తోంది. డబ్ల్యుటివొ వివాదాల పరిష్కారానికి (డబ్ల్యుటివొ డిస్ప్యూట్ సెటిల్మెంట్) సంబంధించిన అప్పాల్లేట్ బాడీ (ఎబి)కి సభ్యుల నియామకం విషయంలో ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం వ్యతిరేకతను వ్యక్తంచేసింది. పలు దేశాలతో వాణిజ్య వివాదాలకి సంబంధించి అమెరికాకు అననుకూలమైన తీర్పు ఏమీ రాలేదు. పలు దేశాలతో అమెరికా కొనసాగిస్తున్న వాణిజ్యపరమైన యుద్ధ వాతావరణంపై సభ్య దేశాల ప్రతినిధులు సమావేశంలో విమర్శలు చేశారు.  ఆలస్యంచేయకుండా ఎబి ఖాళీలను నింపడానికి  డబ్ల్యుటివొ సభ్యులు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని భావించాయి. అదే సమయంలో ఇతర అంశాలపై అంటే వివాదాల పరిష్కార యంత్రాంగం పనిచేయడం వంటి వాటిపై కూడా చర్చలు చేశాయి.

భారత వాణిజ్య శాఖామంత్రి  సమావేశంలో మాట్లాడుతూ వాణిజ్య ఉద్రిక్తతలు కొద్దిగా కూడా తగ్గని నేపథ్యంలో సమావేశం నిర్వహణ ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుందని అన్నారు. పలు ట్రేడింగ్ మేజర్లు రక్షణ విధాన ధోరణులు చూపుతున్నాయి. ఇది స్వేచ్ఛా, రక్షణ పూరిత వాతావరణ ప్రయోజనాలకు ప్రమాదం కలిగించడం ద్వారా ప్రపంచంలో దశాబ్దాలుగా పోస్ట్వార్ ప్రాస్పరిటీ ధోరణులను మరింత పెంచుతోంది. న్యూఢిల్లీ మంత్రివర్గ  ప్రారంభ సమావేశంలో భారత మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశాలలో నివసిస్తున్న 7.3 బిలియన్ల మంది ప్రజలు అభివృద్ధి ప్రయోజనాలను కోల్పోకూడదన్నారు.  అభివృద్ధి సంబంధిత అంశాలతోపాటు, సహాయం ద్వారా కాకుండా వాణిజ్యం ద్వారా దేశాలు వృద్ధి చెందాలని డబ్ల్యుటివొ చెబుతుంది.

ఇలాంటి ఆందోళనలనే డబ్ల్యుటివొ డైరక్టర్ జనరల్ రోబెర్టో అజెవెడో పునరుద్ఘాటించారు. డబ్ల్యుటివొ సంస్కరణల గురించి జరుగుతున్న చర్చలను ప్రస్తావిస్తూ, ‘ ఇది మీ సంస్థ చర్చల్లో మీ గళాలను వినిపించండిఅని అన్నారు. డబ్ల్యుటివొ పనికి సంబంధించిన మూడు మూల స్తంభాలైన అంశాలను పేర్కొన్నారు  పర్యవేక్షణ, వివాదాల పరిష్కారం,   సభ్యుల సమావేశ చర్చా విశేషాలను  అజెవెడో వివరించారు.

ఎస్ అండ్ డిటి ననుసరించి అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలు బహుపక్ష వాణిజ్య నిబంధనలను అమలుచేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. డబ్ల్యుటివొ చీఫ్ అజెవెడో మాట్లాడుతూ ఎస్ అండ్ డిటి యంత్రాంగం సంక్షోభ పరిస్థితులను ఛేదించేందుకు కొత్త ఆవిష్కరణలతో ముందుకురావాలని అభిప్రాయపడ్డారు.

పరిస్థితుల్లో ముందుకు పోవాలంటే ట్రేడ్ఫెసిలిటేషన్ అగ్రిమెంట్ టైప్ మోడల్ మంచి మార్గం అని డబ్ల్యుటివొ చీఫ్ అన్నారు. దీంట్లో దేశాలు తమదైన ప్రమాణాలను ఏర్పాటుచేసుకోవచ్చు. కానీ ఇండియా, చైనాలతో పాటు మొత్తం 17 సభ్యదేశాలు ప్రతిస్పందిస్తూ ఎస్ అండ్ డిటి ప్రొవిజన్లు అభివృద్ధి చెందుతున్న దేశాల హక్కులు. వీటిని డబ్ల్యుటివొ ప్రస్తుతమే కాకుండా, భవిష్యత్ ఒప్పందాలలో సైతం పరిరక్షించడం ద్వారా  బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డాయి. అదే సమయంలో నిరుపేద దేశాల (లీస్ట్ డెవలెప్డ్ కంట్రీస్, ఎల్డిసి) అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కూడా అభిప్రాయపడ్డాయి. కజకస్తాన్, టర్కీ, అర్జెంటీనా, బ్రెజిల్, గైతమాలా దేశాలు సంయుక్త ప్రకటనపై సంతకాలు చేయలేదు. డబ్ల్యుటివొ శాశ్వత ప్రతినిధి అయిన భారత దేశానికి చెందిన దీపక్ మాట్లాడుతూ ఎస్ అండ్ డిటి అంశంపై భారత స్థానం విస్పష్టం. డబ్ల్యుటివొ యంత్రాంగంలో ఇది అత్యావశ్యకం. దేశాలను ఇంకా వర్గీకరించడాన్ని మాత్రం భారత్ విశ్వసించదుఅని వ్యాఖ్యానించారు. అలా సమావేశంలో పాల్గొన్న 22 దేశాల ప్రతినిధుల్లో 17 మంది సభ్యులు డబ్ల్యుటివొ లోనిస్పెషల్ అండ్ డిఫరెన్షియల్ ప్రొవిషన్స్ని బలోపేతం చేయాలని పునరుద్ఘాటించాయి. అలా న్యూఢిల్లీ మంత్రివర్గ సదస్సు టాక్టికల్గా లబ్దిపొందింది.

సమావేశ సంయుక్త ప్రకటనలో వివిధ దేశాలతో ఎలక్ట్రానిక్కామర్స్ ఒప్పందాల గురించి ప్రస్తావించలేదు. అయితే బహుపక్ష అవసరాన్ని మాత్రం ఇది ప్రస్తావించింది. ఏకాభిప్రాయ భూమికగా బహుపక్ష మార్గాలు అనుసరిస్తే అందరినీ కలుపుకుపోయే అభివృద్ధి  సాధ్యం అవుతుంది. తద్వారా బహుపక్ష వాణిజ్య వ్యవస్థను బలోపేతం  చేయొచ్చు. అవి డబ్ల్యుటివొ నిబంధనలకు తగ్గట్టుగా కొనసాగుతాయి కూడా.  న్యూఢిల్లీ మంత్రివర్గ సదస్సు కొత్త డైనమిజాన్ని ఇంకించిందనడంలో సందేహంలేదు. అంతేకాదు అంతర్జాతీయ సంస్థ గ్లోబల్ వాణిజ్యం పరంగా ముందుకు వెళ్లేందుకు తన వంతు సేవలందించేందుకు సహాయపడుతుంది.