బ్రిగ్జిట్ ఒప్పందానికి ఆఖరి పిలుపు:  తర్వాత ఏమిటి?

బ్రిటిష్ ప్రధాని థెరిస్సామే ప్రవేశపెట్టిన బ్రిగ్జిట్ ఒప్పందాన్ని గతంలో మూడుసార్లు పార్లమెంట్ తిరస్కరించింది. ఒప్పందం నుంచి విరమించుకునే విషయమై బ్రిటిన్ నాయకురాలు  తన చివరి, ఆఖరి సవాలును ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. ఈ ఒప్పందం మళ్లాకనుక నిరాకరించడం జరిగితే అది ఘోర ఫలితాలకు దారితీస్తుది. ఒప్పందంతోపాటు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సైతం చేదు అనుభవాలను చవిచూస్తుంది. ఈ విషయాన్ని ‘ఎగ్జిటింగ్ ది యురోపియన్  యూనియన్’ సెక్రటరీ ఆఫ్ స్టేట్ స్టీఫన్ బార్క్లే వెల్లడించారు. ఈ ఒప్పందం కనుక ఓడిపోతే ఈ డీల్ పూర్తిగా మృతప్రాయం అవుతుందన్నారు. బ్రిటిష్ ప్రధాని థెరిస్సా మే పరిస్థితి ప్రస్తుతం ఎంతో బలంగా ఉంది. ఈ ఒప్పందాన్ని ఆమె హౌస్ ఆఫ్ కామన్స్ లో త్వరలో  మళ్లా ప్రవేశపెట్టి పార్లమెంట్ ఆమోదాన్ని కోరనున్నారు. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్న వారు ప్రధానంగా ఈ ఆరువారాల సంభాషణల సమయంలో కొత్త మార్పులను ఏవైనా ప్రవేశపెట్టారా అన్నదానిపై మౌలిక ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ధెరిస్సా కన్సర్వేటివ్ పార్టీలోని కొందరు ‘యూరోస్కెప్టిక్స్’ ఈ ఒప్పందం యుకెని కస్టమ్స్ యూనియన్‌కి పరిమితం చేస్తుందంటున్నారు. అయితే డెమోక్రాటిక్ యూనియనిస్ట్ పార్టీ (డియుపి) మాత్రం యుకె ఆర్థిక, రాజ్యాంగ సమగ్రతలను కాపాడేలా మార్పులు ఉంటేనే ఈ ఒప్పందం సత్ఫలితాలు చూపిస్తుందని ముందర నుంచీ దృఢంగా అభిప్రాయపడుతూ వస్తోంది. అలాగే గ్రేట్ బ్రిటన్, ఉత్తర ఐర్లండ్ మధ్య తీవ్ర సరిహద్దు వివాదాన్ని పక్కన పెట్టాలంటోంది. మరోవైపు లేబర్ పార్టీ ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా కార్మికుల హక్కులు, అలాగే బ్రిటన్‌లో నివసిస్తున్న యూరోపియన్ల హక్కులు, మూరప్ దేశాల్లో నివసిస్తున్న బ్రిటన్ వారి హక్కుల అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇది ఈ ఒప్పందం ఆమోదాన్ని అంగీకరించడం లేదు. అంతేకాదు ఈ పార్టీ యూరోపియన్ కూటమిలో బ్రిటన్ సభ్యత్వంపై రెండవ పర్యాయం రెఫరెండమ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. నాల్గవసారి జరిగే  ఓటింగ్‌లో లేబర్ పార్టీ పాల్గొనక పోయే అవకాశాలు ఇంకా నిర్థారణ అవలేదు కాబట్టి థెరిస్సా మే ఈ ఒప్పందాన్ని మొదటిదశ ఆమోదం కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టే వీలుంది. ఇక మిగతా పార్టీలైన గ్రీన్ పార్టీ, లిబరల్ డెమోక్రాట్స్, స్కాటిష్ నేషనల్ పార్టీ, ప్లైయిడ్ సిమ్రు ఇవన్నీ బ్రిగ్జిట్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో కన్సర్వేటివ్‌ పార్టీకి ఎదురయ్యే సవాళ్లు రానున్న రోజుల్లో ఎంతో కఠినంగా ఉంటాయి. ఒప్పందం అంగీకారం విషయంలో పార్లమెంటులో పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. ‘నో డీల్’ లేదా ‘నో బ్రిగ్జిట్’ ఛాయిస్‌లు పార్లమెంటులో తలెత్తాయి. బ్రిగ్జిట్ సమస్యతో పాటు, ఈ నెలలో జరిగిన స్థానిక ఎన్నికల్లో థెరిస్సా పార్టీ బాగా నష్టాలను చవిచూసింది. ఈ ఎన్నికల్లో 1334 మంది కౌనిసలర్లను కోల్పోయింది. యూరోపియన్ కూటమికి అనుకూలంగా ఉన్న లిబరల్ డెమొక్రాట్లు 703 స్థానాలను గెలుచుకున్నారు. మే 23న జరిగే యురోపియన్ కూటమి పార్లమెంటరీ ఎన్నికల్లో కూడా దేనికి ఓటు వేస్తారన్నది స్పష్టమవుతుంది. ఇటీవల పోలింగ్ నివేదికల  ప్రకారం నెజెల్ ఫరాగ్స్ బ్రిగ్జిట్ పార్టీ మిగతా రెండు పెద్ద పార్టీల కన్నా కూడా ముందుకు దూసుకువెడుతుందని తెలుస్తోంది. ఈ పార్టీ 30 శాతంతో ముందుంటే, మిగతా పెద్ద పార్టీలైన లేబర్ పార్టీ 21 శాతం , టోరీలు 12 శాతంతో ఉన్నాయి.

రాజీనామా విషయానికి వస్తే, ఒప్పందం ప్రతి దశలో ఓడిపోతూ వచ్చిన తర్వాత  కూడా బ్రిటన్ ప్రధాని మే రాజీనామా విషయాన్ని ప్రతిసారీ దాటవేస్తూ వచ్చారు. ఈ ఒప్పందం నాల్గవ సారి ఓటమి పాలయినా కూడా పార్లమెంట్ ఎంపిలు రెఫరెండమ్ ఫలితాలను గౌరవింస్తారని థెరిస్సా భావిస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి థెరిస్సా  మే చర్చల ద్వారా ఎట్లాగో అట్లా బయటపడితే అది ఆమెకు, ఆమె ప్రభుత్వానికి పెద్ద క్రెడిట్ అనే చెప్పాలి. అలా కాకుండా పరిస్థితులు తిరగబడ్డ పక్షంలో దేశ ఆర్థికరంగం, రాజ్యాంగ సమగ్రతల స్థాపన పరంగా ముందుగానే బ్రిటన్ కొన్ని ఆటంకాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఏదేమైనప్పటికీ, ఒప్పందతో లేదా ఒప్పందరహితంగా ఈ సంవత్సరం అక్టోబర్ 31 నాటికి బ్రిగ్జిట్ నుంచి బ్రిటన్ మృదువుగా తప్పుకోవాలి. ఎందుకంటే యూరోపియన్ కూటమిలోని మిగిలిన 27 సభ్య దేశాలు బ్రిగ్జిట్‌లో బ్రిటన్  చేరడం లేదా తప్పుకోవడంపై పునరాలోంచించుకునేందుకు గాను ఆరు నెలల సమయాన్ని బ్రిగ్జిట్ బ్రిటన్‌కు ఇచ్చింది.

ఒప్పందానికి సంబంధించి అనుకూలంగా లేదా ఒప్పందానికి వ్యతిరేకంగా భారత్‌లో తలెత్తిన పలు అభిప్రాయభేదాల  వల్ల బ్రిటన్‌తో వాణిజ్యం, పెట్టుబడులు దెబ్బతింటాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిజ్వర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికలో ‘రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల ఒప్పందాలపై  పునర్ చర్చించడం వల్ల మార్చిలో బ్రిగ్జిట్ అవకాశాలు భారత ఎగుమతిదారులకు పలు అవకాశాలు ఇస్తాయ’ని పేర్కొంది. మరోవైపు భారత విదేశీ రంగంలో పటిష్టమైన పెట్టుబడుల సంబంధాలపై బ్రిగ్జిట్ ప్రభావం చూపించే అవకాశం ఉందని  గుర్తించారు. ‘నో డీల్’ పరిస్థితి బ్రిటిష్ కరెన్సీ పౌండ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే కొత్తగా పుట్టుకొచ్చిన మార్కెట్లపై కూడా దీని ప్రభావం బాగా ఉంటుంది. యుకె ఆర్థిక మార్కెట్‌లోని క్లిష్ట పరిస్థితుల ప్రభావం, దాని ఘోర పరిణామాలతో పాటు ఇతర పరిస్థితుల వల్ల బ్రిటన్ తిరిగి పూర్వ పరిస్థితికి రావడానికి మరికొంత  సమయం తప్పనిసరిగా పడుతుంది.

రచన: డా.సంఘమిత్ర శర్మ, యురోపియన్ వ్యవహారాల వ్యూహాత్మక విశ్లేషకులు