ఇండియా-నేపాల్ పెట్రోలియం పైప్‌లైన్: దక్షిణ ఆసియాలోనే మొదటి పైప్‌లైన్ 

భారత, నేపాల్ దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలలో మరో మైలురాయిని సాధించాయి.ఇరు దేశాల ప్రధానమంత్రులూ భారతదేశం బీహార్ రాష్ట్రంలోని మోతిహరీ నుంచి నేపాల్‌లోని అమెలేఖ్ గుంజ్ వరకూ ఉన్న దక్షిణ ఆసియా తొలి క్రాస్ బోర్డర్ పెట్రోలియం ఉత్పత్తుల పైప్‌లైన్‌ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమిష్టిగా ప్రారంభించారు. ఈ పైప్‌లైన్ 69 కిలోమీటర్లు ఉంటుంది. ఇదులో 32.7 కిలోమీటర్లు భారత్ వైపున ఉంటే, 37.2 కిలోమీటర్లు నేపాల్ వైపున ఉంటుంది. రెండు మిలియన్ టన్నుల స్వచ్ఛమైన పెట్రోలియం ఉత్పత్తులను ఇది నిరాటంకంగా నేపాల్ ప్రజలకు ప్రతి సంవత్సరం అందిస్తుంది.

భారత, నేపాల్ మధ్య ద్వైపాక్షిక సన్నిహిత సంబంధాలకు చిహ్నంగా భారత ప్రధాని నరేంద్రమోదీ దీనిని అభివర్ణించారు. మోతిహారి-అమెలేఖ్ గుంజ్ పైప్‌లైన్ ప్రాజెక్టు ఈ ప్రాంతంలో ఎనర్జీ భద్రతను పెంచడంలో సహాయపడుతుంది. ఇలా చేయడం వల్ల రవాణా ఖర్చులు బాగా తగ్గుతాయి. అత్యున్నత రాజకీయ స్థాయిలో నిత్యం పరస్పరం ఇచ్చిపుచుకోవడం ఉండడంపై  ప్రధాని మోదీ సంతృప్తిని వ్యక్తంచేశారు. భారత-నేపాల్ భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఎజెండాను ఇది మరింత విస్తృతంచేస్తుంది. న్యూఢిల్లీ నుంచి ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేస్తూ ప్రధాని మోదీ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వివిధ రంగాలకు మరింత గాఢంగా పెనవేసుకుంటాయనే విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. నేపాల్ అభివృద్ధిపరంగా భారత్ సహాయం చేయడంలో ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని కూడా ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. 

 ఖాట్మండులో ఈ కార్యక్రమం సందర్భంగా నేపాల్ ప్రధాని కె.పి శర్మ ఓలి మాట్లాడుతూ వాణిజ్యం, రవాణా, మౌలికసదుపాయాల పరంగా ఈ పైప్‌లైన్ ప్రాజెక్టు మంచి అనుసంధానంగా ఉంటుందని ఆయన అభివర్ణించారు. మంచి రాజకీయ నిబద్ధతతో భారత్, నేపాల్ రెండు దేశాలు ఒకేరకమైన విజన్‌ని కలిగి ఉన్నాయని, ప్రజల అభివృద్ధి, సంపద, ఆనందాలే రెండు దేశాల ప్రధాన లక్ష్యమన్నారు. దీన్ని ఆవిష్కరించడంలో రెండు దేశాలు గట్టి పట్టుదలతో వ్యవహరిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. నేపాల్ ప్రజలందరికీ పెద్ద ఊరట అయిన మరో ప్రకటనను కూడా ప్రధాని ఓలి చేశారు. పెట్రోలియం, డీజిల్  ధరలను లీటరుకు రెండు రూపాయలకు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. భారత దేశం నుంచి నేపాల్‌కు చమురు ఈ పైప్‌లైన్ ద్వారా పంపిణీ అవుతుంది. దీనివల్ల ఖరీదు తక్కువ కావడమే కాకుండా ఎంతో సమయం దీనివల్ల మిగులుతుంది. అంతేకాదు రహదారి ట్రాఫిక్‌ను సైతం తగ్గిస్తుంది. పెట్రోలియం ఉత్పత్తులను రవాణా చేసే టాంకర్ల వల్ల విడుదలయ్యే వాయు కాలుష్యం కూడా తగ్గుతుంది.           

నేపాల్ 1973 సంవత్సరం నుంచి తనకు అవసరమైన చమురు ఉత్పత్తులన్నింటినీ భారత్ నుంచే దిగుమతి చేసుకుంటోంది. సాధారణంగా చమురు, చమురు సంబంధిత ఉత్పత్తుల రవాణాకు ట్యాంకర్లను ఉపయోగిస్తుంటారు. ప్రభుత్వ రంగం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు సంబంధించిన  బీహార్‌లోని బరాని నూనెశుద్ధి కర్మాగారం నుంచి, రాగ్జాల్ డిపోట్ నుంచి నేపాల్ ఆయిల్ కార్పొరేషన్‌తో 2017లో ఒప్పందాన్ని పునరుద్ధరించింది. దీనివల్ల మరో ఐదు సంవత్సరాల పాటు అంటే 2022 సంవత్సరం వరకూ చమురు పంపిణీ నిరాటంకంగా కొనసాగుతుంది. 

మోతిహరి-ఆమ్‌లేఖ్‌గుంజ్ పైప్‌లైన్‌ ప్రాజెక్టును తొలిసారి 1996 ప్రతిపాదించారు. తర్వాత ఎన్నో సంవత్సరాలు అది అమలుకు నోచుకోకుండా పక్కన పడుంది. 2014లో ప్రధాని మోదీ నేపాల్ పర్యటించినపుడు దీనికి ముక్తి లభించింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు వేగం పుంజుకుంది. ఇరుదేశాల ప్రభుత్వ చమురు కంపెనీల మధ్య దీనికి సంబంధించిన ఒప్పందం కూడా కుదిరింది. ఈ ఒప్పందం ఇండియన్ ఆయుల్ కార్పొరేషన్ లిమిటెడ్, నేపాల్ ఆయిల్ కార్పొరేషన్‌ల మధ్య 2015 సెప్టెంబరులో ఒప్పందం కుదరింది. దీనికి పునాది రాయిని రెండు దేశాలకు చెందిన ప్రధానులు మోదీ, ఓలీలు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ నుంచి రిమోట్ కంట్రోల్‌తో వేసి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది ఏప్రిల్‌లో న్యూఢిల్లీ పర్యటనకు నేపాల్ వచ్చిన సమయంలో ఈ ప్రారంభోత్సవం జరిగింది.  

ఈ ప్రాజెక్టును 30 నెలలో పూర్తిచేయాలని ఇరుదేశాలు డెడ్‌లైన్ పెట్టుకున్నాయి. అయితే రెండు దేశాల అధికారుల అవిశ్రాంత కృషితో ఈ టార్గెట్‌ను అనుకున్న సమయం కన్నా  సగం సమయంలోనే పూర్తిచేశారు. ఇది నేపాల్‌లోని భారత ప్రాజక్టులన్నింటిలో అత్యంత వేగంగా పూర్తయిన ప్రాజెక్టుగా రికార్డు సృష్టించింది.  ఇది ఎప్పటినుంచో నేపాల్‌లో భారత సహాయంతో చేపట్టిన ప్రాజెక్టులు ఆలస్యం అవుతాయన్న విమర్శల్ని బద్దలు చేసింది. ఈ విజయంతో  నేపాల్‌లో భారత సహాయ ప్రాజెక్టులు ఆలస్యం కావడం వల్ల ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోతుందనే విమర్శలకు స్వస్తిపలికినట్టయింది. రెండు దేశాల మధ్య ఒప్పందపడ్డ ప్రాజెక్టుల ప్రగతి పురోగతి గురించి అత్యున్నత స్థాయిలో తరచూ సమావేశాలు, సమీక్షలు జరుగుతున్నాయి. గత నెల ఇండియా-నేపాల్ కమిషన్ మీటింగ్ ఖాట్మండులో జరిగింది. ఈ సమావేశానికి ఇరుదేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు ఛైయిర్‌గా వ్యవహరించారు. ఇందులో ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక సంబంధాల విస్తృతిని సమీక్షించారు. సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి కొత్త రంగాలను రెండు దేశాలు గుర్తించాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. రెండు దేశాల ప్రధానులు ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు విస్తృతకావడం, ప్రగతిని సాధించడం పట్ల సంతృప్తిని వ్యక్తంచేశారు.  నేపాల్‌లో 2015లో సంభవించిన భూకంపంలో బాధితుల కోసం ఏభై వేల ఇళ్లను భారత్ నిర్మించి ఇవ్వడం పట్ల నేపాల్ ప్రధాని ఓలి భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

రచన: రత్తన్ సాల్దీ, రాజకీయ వ్యాఖ్యాత