ఐఎఎఫ్: గేమ్-ఛేంజర్

భారత వైమానిక దళం రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రెంచి డస్సాల్ట్ ఏవియేషన్ నుంచి వచ్చే నెల రెండవ వారంలో పొందడానికి సర్వం సన్నద్ధమైంది. తొలి రాఫెల్ జెట్‌ను స్వీకరించడానికి భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫ్రాన్స్ వెడతారు. భారత వైమానిక దళం 24 మంది పైలట్లను మూడు బ్యాచులుగా చేసి వచ్చే ఏడాది మే దాకా వారికి శిక్షణ ఇస్తారు. అదే సమయంలో తొలి విడత రాఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు చేరతాయి. వేగంగా రాఫేల్ యుద్ధవిమానాలను భారత్‌కు డెలివరీ చేయాలనుకోవడానికి హేతుబద్ధత లేకపోలేదు. న్యూఢిల్లీలోని రక్షణ వ్యూహాత్మక నిపుణులు మూలపడి ఉన్న వందల కొద్దీ కాలంచెల్లిన ఐఎఎఫ్ ఎంఐజి-21, ఎంఐజి-23, ఎంఐజి-27 యుద్ధవిమానాలను తొలగించాలని గుంజాటన పడుతన్నారు. ఇవన్నీ సర్వీసులోంచి ఒక్కొక్కటిగా తీసేసినవి.

గత కొన్ని దశాబ్దాలుగా భారత పొరుగుదేశాల్లో తలెత్తుతున్న పరిణామాలు, పెరుగుతున్న సరిహద్దు తీవ్రవాదం ఇందుకు కారణం. ఇటీవల కాలంలో భారత రక్షణ విధానంలో కూడా మార్పులు పొడసూపడం గమనించవచ్చు. పొరుగు దేశాలు ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేసే ధోరణిని అనుసరించాలన్న విధానాన్ని భారత ప్రభుత్వం  చేపట్టింది. అంతేకాదు దీనికి సంబంధించి భారత్ స్పష్టమైన సందేశాన్ని కూడా ప్రపంచానికి పంపింది. పరిస్థితులు విషమించిన పక్షంలో ‘నో ఫస్ట్ యూజ్’ న్యూక్లియర్ సిద్ధాంతాన్ని న్యూఢిల్లీ సమీక్షిస్తుందని కూడా భారత్ స్పష్టం చేసింది.

  గత ఫిబ్రవరిలో బాలాకోట్ సర్జికల్ దాడులు జరిగాయి. అది భారత ప్రభుత్వం తీసుకున్న ఈ  రక్షణ విధానాన్నే వెల్లడిస్తోంది. ఉత్తర భాగంలో తలెత్తుతున్న పరిస్థితులను ఎదుర్కోవాలంటే శక్తివంతమైన వైమానిక సామర్థ్యం, ఆయుధ వ్యవస్థ అవసరమవుతాయని కూడా భారత నాయకత్వం భావించింది. ఈ సందర్భంలో, రాఫెల్ యుద్ధవిమానాల సేకరణ ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. బాలాకోట్ ఆపరేషన్ అనంతరం, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ రాఫేల్ యుద్ధ విమానాలు గతంలో వాటికన్నా మంచి ఫలితాలు ఇస్తాయని అన్నారు. దీంతో రాఫేల్ యుద్ధ విమానాల సామర్థ్యాన్ని ఆయన ప్రకటన నొక్కి చెప్పినట్టైంది. అలాంటివి మనదేశంలో ప్రస్తుతం లేవు కూడా. భారత వైమానిక దళం డజన్ల కొద్దీ మిరాజ్-2000 ఎయిర్‌క్రాఫ్టుల మీద ఆధారపడాల్సి వస్తోంది. వీటిని కూడా రాఫేల్ యుద్ధ విమానాలు అందిస్తున్న కంపెనీయే తయారుచేసింది. వీటిని బాలాకోట్ ఆపరేషన్‌లో ఉపయోగించారు. 

 రికార్డులు చెబుతున్న ప్రకారం రాఫేల్ అత్యున్నత యుద్ధవిమానాలుగా గుర్తించబడ్డాయి. యుఎస్  అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్22 రాప్టర్‌కు వీటికి కేవలం ఐదు సంవత్సరాల అంతరం మాత్రమే ఉంది. ఇది ఐఎఎఫ్‌కు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.

 భారత వైమానిక దళంలో రాఫేల్ యుద్ధ విమానాల ప్రవేశం ‘గేమ్ ఛేంజర్’గా పేర్కొనాలి. వైమానిక ఆపరేషన్లలో శత్రుదేశాలు కలగచేసుకోనివ్వకుండా నిరోధించే సామర్థ్యం వీటికి ఉంది. ఇది విస్తృతస్థాయిలో ఆయుధాలను కలిగి ఉంది. అంతేకాదు రాఫేల్ వైమానికంగా అత్యున్నత స్థాయి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇంటర్‌డిక్షన్‌తో పాటు ఏరియల్ రికోనైసాన్స్, ఇన్-డెప్త్ దాడులు, అణ్వాయుధాల మిషన్స్‌ ని అడ్డుకునే సామర్థ్యం ఉన్నాయి. రాఫేల్ భారత అవసరాలను తీరుస్తుందనడంలో సందేహం లేదు. ఆయుధాలను ఎదుర్కొనేందుకు  పైలెట్స్ లైటనింగ్‌తో కూడిన వేగవంతమైన సామర్థ్యం , లెహ్ లాంటి ఎక్కువ ఎత్తు నుంచి దాడులను వేగంగా చేసేవి, శత్రువుల ట్రాకింగ్ సిస్టమ్స్‌ ను గుర్తించేందుకు అవసరమయ్యే రాడార్ వార్మింగ్, దేశంలోపలికి చేసే క్షిపణి దాడులను ఎదుర్కొనే డికాయ్ సిస్టమ్ వంటివి రాఫేల్ యుద్ధవిమానంలో ఉన్నాయి. 

రాఫేల్‌లో అధునాతన ఆయుధాలు కూడా ఉన్నాయి. అంటే లాంగ్రరేంజ్ గ్రౌండ్ అటాక్ క్షిపణులు వంటివి. ఇవి 300 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్‌ను పక్కాగా ఢీకొనెలా ఉంటాయి. ఇంకొకటి ఎయిర్ టు ఎయిర్ మిజైల్. ఇది అత్యున్నత ప్రమాణాలతో కూడినదని చెప్పాలి. నూరు కిలోమీటర్ల పరిధిలోని శత్రు ఎయిర్ క్రాఫ్ట్‌ ను  ఢీ కొడుతుంది. రాఫేల్ పోరాటంలో రాటుదేలినవిగా నిరూపించబడినవి. ఎన్నో సంవత్సరాల నుంచి పలు యుద్ధాలలో వీటిని వాడారు కూడా.

దీనికి సంబంధించిన మరో అభివృద్ధి పరిణామం ఉంది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తెజాస్ ఎయిర్‌క్రాఫ్టుపై ‘టెస్ట్-సార్టీ’గా ప్రయాణించారు. ‘తేజా’ చాలాపనులు చేసే సూపర్‌సానిక్ ఎయిర్‌క్రాఫ్ట్. ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్ లను పక్కా ప్లానింగ్, డిజైన్లతో రూపొందించారు. ఇవి కాకుండా అనుక్షణం అందుబాటులో ఉండే క్షిపణులు, ఆయుధాలు కూడా ఇందులో ఉన్నాయి. ‘తేజా’ ఎయిర్ క్రాఫ్ట్ కూడా త్వరలోనే భారత వైమానిక దళంలోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

అభివృద్ధి చెందుతున్న భారతానికి లెక్కకు మించిన ఎన్నో జాతీయ ప్రయోజనాలు ఉన్నాయి. తన దేశ ప్రయోజనాలు రక్షించుకోవడానికి శక్తివంతమైన సైనిక సామర్థ్యం అవసరం.  ఈ సందర్భంలో, భారత్ దేశీయంగా తయారుచేసిన ఆయుధాల మీద ఆధారపడుతోంది. ఇవి పటిష్టమైన పారిశ్రామిక సామర్థ్యంతో తయారుచేస్తున్నారు. ఇది వ్యూహాత్మక స్వాతంత్ర్యాన్ని తెలుపుతోంది. అంతేకాదు స్వతంత్ర్యమైన దేశీయ సామర్థ్యం, శక్తియుక్తులను తెలుపుతుంది. రాఫేల్ ఐఎఎఫ్ ప్రస్తుత అవసరాలకు సామర్థ్యరీత్యా ఎంతో బెస్ట్, అవసరమైనవి కూడా. అయితే దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే, దేశీయ పారిశ్రామిక సామర్థ్యం పెంపుదలపై దృష్టి పెట్టాలి. ఇందుకు ప్రస్తుతం కొనుగోలు చేసిన వాటిని పనిముట్టుగా చివరి వరకూ ఉపయోగించుకోవాలి.

 

రచన: ఉత్తమ్ కుమార్ బిశ్వాస్, రక్షణ విశ్లేషకులు