వాతావరణ మార్పులు అసలు సవాలు: ఐక్యరాజ్యసమితిలో ప్రధాని నరేంద్రమోదీ పునరుద్ఘాటన

స్వీడన్‌కు చెందిన పదహారేళ్ల గ్రెటా థన్‌బర్గ్ పర్యావరణ కార్యకర్తగా పనిచేస్తున్నారు. న్యూయార్కు ఐక్యరాజ్యసమితి సమావేశంలో థన్‌బర్గ్  ఎంతో దు:ఖంతో చేసిన విజ్ఘప్తి యుఎన్ అసెంబ్లీలోని ఎందరో నాయకుల అంతరాత్మలను కుదిపేసింది.

 

‘‘ భవిష్యత్తు తరాల కళ్లు మీ మీదే ఉన్నాయి. మేం వైఫల్యం చెందితే,  ఎప్పటికీ క్షమించం’ అని గ్రేటా ప్రపంచ నాయకులపై సవాలు విసిరారు. 

 

మానవ ఉనికికి నేడు పొంచి ఉన్న అతి పెద్ద ప్రమాదం వాతావరణ మార్పు. వాతావరణ వ్యవస్థలో అనూహ్యమైన మార్పులు ప్రపంచమంతటా విపరీత పరిణామాలకు  దారితీస్తున్నాయి.  

 

‘ఎంతో సీరియస్ సమస్య అయిన వాతావరణ మార్పును అధిగమించాల్సిన అవసరాన్ని మనం అంగీకరించాలి. అందుకే ఇప్పుడు మనం చేస్తున్న పని సరిపోదు’ అని  భారత ప్రధాని నరేంద్ర మోదీ యుఎన్ సమావేశంలో ప్రపంచ నాయకులకు వెల్లడించారు. ‘ప్రవర్తనా పరమైన మార్పు తేవడానికి గ్లోబల్ స్థాయిలో ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని సమావేశంలో అభిప్రాయపడ్డారు. 

 

‘దురాశగా ఉంకూడదనేది మార్గదర్శక నిబంధనగా ఉండాలి’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ ప్రత్యేక శిఖరాగ్రసభలో అభిప్రాయపడ్డారు. ఈ అంశానిపై సీరియన్‌గా మాట్లాడడం సరిపోదు. చేతల్లో చర్యలు చేపట్టాలి. అందుకోసం రోడ్ మ్యాప్ వేయాలి అని మోదీ అన్నారు. 

 

ఉష్ణోగ్రతలో వేడి వల్ల అనూహ్యమైన మార్పులు  వాతావరణంలో వస్తాయి. వ్యవసాయం, మత్య్సపరిశ్రమ రంగాలు, భూమి, సముద్ర జీవవైవిధ్యం, దేశీయ, ప్రాంతీయ భద్రత, వ్యాపారం, పట్టణ అభివృద్ధి, వలసలు, ఆరోగ్యం వంటి వాటిల్లో విపరీతమైన మార్పులకు ఇది దారి తీసింది. ఇలాంటి పరిస్థితులు కొన్ని దేశాల భౌతిక ఉనికికి కూడా ప్రమాదకరంగా పరిణమిస్తోంది. అంతేకాదు సుస్థిర విజయాలు, కలుపుకుపోయే అభివృద్ధి సాధన వంటి ఆశలను కూడా నాశన చేస్తాయి. 

 

ప్రమాదం అక్షర సత్యం. ఈ విషయాన్ని వాతావరణ శాస్త్రవేత్తలు కూడా హెచ్చించారు. ఇప్పటికీ సమయం మించలేదు మళ్లా సామాన్య పరిస్థితులను పునరుద్ధరించవచ్చు. 

 

ఈ రోజు అవసరం ఏమిటంటే సమగ్ర విధాన అమలు. ఇందులో ప్రతి విషయం అంటే విద్య నుంచి విలువల వరకూ విస్తరించి ఉంది. అంతేకాదు జీవనశైలి నుంచి అభివృద్ధి ఫిలాసఫీలను కూడా ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. 

 

భారత దేశం ప్రధాని సుస్థిర చర్యలను జాబితాను రోడ్ మ్యాప్‌లో భాగంగా పేర్కొన్నారు.   సమిష్టి వేదిక ఏర్పాటు చేయాలని పునరుత్పాదక సమిష్టి వేదికను ఏర్పుటుచేయాలను కున్నట్టు ప్రధాని వివరించారు. అందుకు రోడ్ మ్యాప్‌ను ముందుపెట్టారు. అలాగే అభివృద్ధి సాంకేతిక ఆవిష్కరణల కోసం ఇ-మొబిలిటీ, పరిశ్రమలకు తక్కువ కార్బన్ ఉన్న మార్గాల అభివృద్ధి, సింగిల్-యూజ్ ప్లాస్టిక్ నిషేధం, అలాగే పెట్రోలియంలో, డీజిల్‌లో రెండు ఇంధనాలను కలపడం వంటివి పెంచడం వంటివి ఉన్నాయి. 

 

 

భారత్ ఇప్పటికీ ఆ మార్పుల అనుభవాలను చవిచూస్తోంది. వర్షాలు పడ్డంలో మార్పులు పొడసూపడం గమనించింది. అలాగే విపరీతమైన వరదలు, కరువు పరిస్థితులు వీటన్నింటినీ గమనించింది. ప్రంపంచలోని 20నగరాలు వరదల ప్రమాదానికి పొంచి ఉన్నాయని పాట్సోడామ్ ఇనిస్టిట్యూట్ వేసిన అంచనా వెల్లడిస్తోంది. వాటిల్లో మన దేశంలోని ముంబయి, చెన్నై, సూరత్, కొల్‌కతా నాలుగునరాలు కూడా ఉన్నాయి. 

 

వాతావరణంలో మార్పుల ప్రభావం ఆహారోత్పత్తుల మీద కూడా పడుతుంది. దీంతో ఉత్పత్తుల ఖరీదు ఆకాశానికి అంటుతాయి. ఆహార లోటు పెరుగుతుంది. అంతేకాదు ఇప్పటికీ దక్షిణ ఆసియాలో ఏడ మిలియన్ల పసిపిల్లలు పోషకాహారలోపంతో బాధపడుతున్నరు. 

 

అంతేకాదు ఈ పరిస్థితులు ఆరోగ్యానికి కూడా రిస్కుగా పరిణమిస్తాయి. ఇప్పటికీ సంవత్సరానికి 3.3 మిలియన్ల మంది ప్రజలు బయటి వాయు కాలుష్య ప్రభావంతో చనిపోతున్నారు. చైనా, భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నాలుగుదేశాల్లో ఇలాంటి మరణాలు అధిక సంఖ్యలో చూస్తున్నాం. 

 

వేడి వాతావరణం  మరింత ఉధృతమైన ఎనర్జీ అభద్రతకు కారణమవుతుంది. దీనివల్ల ఎనర్జీ పంపిణీ పరిమితమైపోవడంతో పోటీ ఏర్పడి దేశా మధ్యన సంఘర్షణలు  చెలరేగుతాయి. 

 

ఫ్రాన్స్‌ తో పాటు భారత్ కూడా ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ కార్యక్రమానికి చొరవను ప్రదర్శిస్తోంది. తద్వారా అన్ని దేశాలూ సాధారణ లక్ష్యాలైన సోలార్ ఎనర్జీ వినియోగాన్ని   పెంచడానికి సహాయపడాలనుకుంటున్నాయి. అది కూడా సురక్షిమైన, సౌలభ్యమైన, ధరతక్కువగా ఉన్న, సమానమైన, సుస్థిరమైన పద్ధతిలో ఈ లక్ష్యాన్ని సాధించాలని భావిస్తున్నాయి. 

 

2022  సంవత్సరం నాటికి నాన్-ఫోజిల్ ఫ్యూయల్ (శిలాజల రహిత ఇంధనం) పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా పునరుత్పాదక ఎనర్జీని పెంచేకునే సామర్థ్యాన్ని 175 జిడ్ల్యు దాటి పెంచాలని భారత్ పథకం వేస్తోంది. తర్వాత 450 ఎండ్ల్యు వరకూ పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రవాణా రంగాన్ని కూడా పూర్తిగా గ్రీన్‌గా మార్చేందుకు భారత్ ప్రణాళికలు  వేస్తోంది. దీన్ని ఇ-మొబిలిటీ ద్వారా సాధ్యం చేయాలని భారత్ ప్రతయత్నిస్తోంది. ప్రధాని మోదీ దీనికి సంబంధించిన భారత రోడ్ మ్యాప్ వివరించారు. 

 

అంతర్జాతీయ విభాగమైన ఐక్యరాజ్యసమితి మార్గదర్శాలను   ప్రతి దేశం చట్టబద్ధంగా కట్టుబడి ఉండేలా, అమలుచేయాలి. ఇప్పుడున్న తీవ్ర  నైతిక ఒత్తిడికి మించి దీని అవసరం ఉంది. 

 

ప్రకృతిని గౌరవించాలి. రక్షించాలి. ప్రకృతి వనరులను వివేకవంతంగా వాడుకోవాలి. మన అవసరాలను తగ్గించుకోవాలి, మన అవసరాలకు తగ్గట్టు జీవించాలి ఇవన్నీ కూడా మన సంప్రదాయాల పరంగా ప్రస్తుత ప్రయత్నాలలో ముఖ్యమైన అంశాలు. భారతదేశానికి సంబంధించి చూస్తే, ప్రకృతి సమతుల్యతతో సామరస్యంగా జీవితాలను కొనసాగించడం సంప్రదాయం. ఈ విషయాన్ని యుఎన్ సమావేశంలో భారత ప్రధాని మోదీ ప్రపంచనాయకులకు విస్పష్టంచేశారు.  

 

మిగతా దేశాలకు మల్లే భారత దేశం కూడా 1.3 బిలియన్ ప్రజల కోరికలు, అవసరాలకు అనుగుణంగా వాతావరణాన్ని సమతుల్యం చేసుకుంటోంది. వాతావరణ మార్పులను తగ్గించడానికి కృషిచేస్తోంది. ఈ రోజు మన బాధ్యతలో మనం వైఫల్యం చెందితే భవిష్యత్తు తరాలవాళ్లు మనల్ని అస్సలు క్షమించరు.

 

రచన: ఎన్. భద్రాన్ నాయర్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ఇండియన్ సైన్స్ జర్నల్