భారత-అమెరికాల ద్వైపాక్షిక సమావేశం

దౌత్యనీతిని నెరపడంలో సమకాలీన ప్రపంచంలో భారత ప్రధాని నరేంద్రమోదీకి మించిన నాయకుడు లేరు. ప్రపంచంలో ఎక్కడికి పర్యటనకు వెళ్లినా అక్కడి నాయకులను తన ప్రసంగం, చర్యలతో సమ్మోహన పరచడంలో ఆయన దిట్ట. వారినే కాదు చట్టరూపకర్తలు,ప్రజలు, వీరందరినీ భారత్‌కు ఆత్మీయులుగా, సన్నిహిత భాగస్వాములుగా మలుస్తారు.

ప్రధానమంత్రిలోని ఈ సామర్థ్యం ఇటీవల ముగిసిన హోస్టన్ కార్యక్రమంలో మరింత ప్రదర్శితమైంది. అప్పటికే ఆయన అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వ్యక్తిగతంగా ఆరు పర్యాయాలు ఒవల్ ఆఫీసులో సమావేశమయ్యారు. భారత-అమెరికా సంబంధాలలో ఇది పెద్ద రికార్డుగా పేర్కొనాలి.

ప్రస్తుతం ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య సోమవారం న్యూయార్కులో వ్యక్తిగతంగా సంభాషణలు జరిగాయి. ఇద్దరూ కలిసి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ వార్షిక సమావేశానికి వెళ్లారు.భారత-అమెరికా ద్వైపాక్షిక సమావేశం పెద్ద ప్రదేశంలో జరిగింది. బహుపక్ష దౌత్యసంబంధాలు లక్ష్యంగా జరిగిన ఈ సమావేశం గ్లోబల్‌గా ప్రపంచాన్ని ఆకట్టుకుంది. నిజానికి చెప్పాలంటే ఇది ఇరుదేశాల నాయకులు చాలా స్వల్ప వ్యవధితో జరిపిన సమావేశమే కానీ అందులో ఎన్నో కీలకమైన అంశాలు చోటుచేసుకున్నాయి.

ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య గుర్తించదగిన భౌతిక కెమిస్ట్రీ ఉంది. ఇది స్పష్టంగా గోచరించింది. ఒకరోజు ముందు, టెక్సాస్‌లోని హూస్టన్‌లో జరిగిన చారిత్రక సమావేశంలో రెండు దేశాల నాయకుల మధ్య అత్యంతసన్నిహితమైన స్నేహ బంధం ఉండడం వారి భౌతికమైన ప్రవర్తనలో స్పష్టంగా గోచరించింది. యుఎన్ సర్వప్రతినిధి సభ సందర్భంలో ఇరు దేశాల మధ్య జరిగిన సమావేశాలు పరస్పర స్నేహానికి సాక్షీభూతం. అంతేకాదు ఎంతో ప్రశంసాత్మకంగా సంబంధాలు కొనసాగుతుండడమే కాకుండా భారత ప్రధాని నరేంద్ర మోది, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య సద్భావన, సదావగాహన పుష్కలంగా ఉన్నాయన్న విషయం స్పష్టంగా కనిపించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ సాధించిన విజయాలను డొనాల్డ్ ట్రంప్ గుర్తించారు. సమకాలీన భారత దేశానికి మోదీని ‘తండ్రిలాంటి వాడం’టూ పేర్కొన్నారు.

అంతర్జాతీయ దౌత్యసంబంధాల పరంగా చూస్తే, ఇరు దేశాల నాయకుల పాత్రగాని, వారి మధ్య ఉన్న భౌతికమైన కెమిస్ట్రీగాని సంబంధాలను మరింత బోలపేతం చేయడమే కాదు బంధాలను పటిష్టం చేస్తోంది. ఇరుదేశాల మధ్య సహకారాన్ని పెంపొందిస్తోంది. కాబట్టి మోదీ, ట్రంప్‌ల మధ్య సరిసమానత్వాన్ని అర్థంచేసుకోగలం.

రకరకాల పుకారులకు విరుద్ధంగా, కామెంటేటర్లు వేస్తున్న ప్రశ్నలకు విరుద్ధంగా అమెరికా అద్యక్షుడు కశ్మీర్ విషయంలో అమెరికా కలుగజేసుకునే ప్రసక్తి లేదని స్పష్టంచేశారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎంత ఘాటుగా, తీవ్రంగా పలుమార్పు ప్రతిస్పందించినప్పటికీ, విజ్ఘప్తులు చేసుతన్నప్పటికీ వాటిని ట్రంప్ లక్ష్యపెట్టడం లేదు.  ఒక సెక్షన్ మీడియా కథనాలననుసరించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కనీసం ఆరుపర్యాయాలు భారత, పాకిస్తాన్ల మధ్య కశ్మీర్ వివాదంపై మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు ట్రంప్ సూచించినట్టు కథనాలు వేశాయి. ప్రధానంగా మియా వ్యాఖ్యాతలు, నివేదికలు ప్రధానంగా గమనించకుండా ఉన్న విషయం ఏమిటంటే అమెరికా అధ్యక్షుడు కశ్మీర్ వివాదంపై భారత్ అంగీకరించిన పక్షంలోనే అనే విషయాన్ని చాలా స్పష్టంగా పేర్కొనడాన్ని గమనించలేదు. 

న్యూయార్కులో మోదీ, ట్రంప్‌ల మధ్య జరిగిన సమావేశం విస్పష్టంగా ఇరుదేశాల మధ్య ఉన్న వాణిజ్య విభేదాలను తొందరలోనే పరిష్కరించుకోబోతున్నట్టు స్పష్టం చేశారు. అంతేకాదు సరికొత్త వాణిజ్య ఒప్పందాన్ని కూడా ప్రకటిస్తామని ఇద్దరు నాయకులు వెల్లడించారు కూడా. వారి నోటి వెంటే ఈ మాటలు వచ్చాయి కాబట్టి వాణిజ్యపరమైన విభేదాలకు అవకాశం లేదు. అంతేకాదు భారత, అమెరికాల మధ్య లోతైన వ్యూహాత్మభాగస్వామ్యం విచ్ఛేదించబడే అవకాశం అంతకన్నా లేదు. 

ఈ సమావేశంలో మరొక ముఖ్య పరిణామం కూడా చోటుచేసుకుంది. సరిహద్దు తీవ్రవాదంను ఎదుర్కొనేందుకు భారత ప్రధాని అనుసరిస్తున్న విధానాల పట్ల అనుసరిస్తున్న మార్గాలు, సామర్థ్యం పట్ల అమెరికా తన నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రకటించింది.  పాకిస్తాన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించడంలో భారత ప్రధాని సామర్థ్యంపై అమెరికా అధ్యక్షుడు పలుమార్పు తన విశ్వాసాన్ని ప్రకటించారు. ఇది కశ్మీర్ పరంగా భారత్ అనుసరిస్తున్న విధానాలను అమెరికా ఏవిధంగానూ వ్యతిరేకించడం లేదన్న విషయాన్ని స్పష్టంచేస్తోంది. అతేకాదు 370 రాజ్యాంగ అధికరణ రద్దు, జమ్ము,కశ్మీర్‌కు సంబంధించిన 35ఎ రద్దు పరంగా కూడా అమెరికా తన వ్యతిరేతను వ్యక్తీకరించలేదు. 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంతకన్నా ఎక్కువగా అమెరికా నుంచి ఆశించడం సరికాదు. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా సైన్యం ఉనికి  ఉన్నా, తాలిబాన్ హింసాత్మక చర్యలకు పాలుపడుతూనే ఉంది. ఆఫ్ఘన్ సమస్య పరిష్కరానికి పాకిస్తాన్ సహకారం కూడా అవసరం. ప్రెసిడెంట్ ట్రంప్ భారత ప్రధాని మోదీకి కశ్మీర్‌లో శాంతి, అభివృద్ధిలకు మద్దతునిస్తున్నారు. ట్రంప్ తన ప్రసంగంలో ఒక్కసారి కూడా కశ్మీర్‌లో తలెత్తిన పరిణామాల గురించి ప్రస్తావించలేదు. ఇది చాలు ట్రంప్ భారత్ పట్ల ప్రదర్శిస్తున్న ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పడానికి. త

మొత్తానికి మోదీ-ట్రంప్ సంభాషణలు ఎంతో అసాధరణమైనవి. మోదీ సమ్మోహనమైన దౌత్యానికి సత్యావిష్కరణ కూడా . 

ప్రొఫెసర్ చింతామణి మహాపాత్ర, ప్రొ వైస్-ఛాన్సిలర్ అండ్ ఛైర్మన్, అమెరికన్ స్టడీస్ సెంటర్, జెఎన్‌యు