కరేబియన్, ఫసిఫిక్ దీవులతో సంబంధాలను సమీక్షించిన భారత్

కరేబియన్ దేశాలతో భారత్‌కు చారిత్రకంగా ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సిఎఆర్ఐసివొఎం బృందంలోని 14 మంది దేశాల నాయకులతో జరిపిన సమావేశం ఈ సంబంధాలను మరింత వేగవంతం చేస్తాయనడంలో సందేహం లేదు. ఈ సమావేశాలను న్యూయార్కులో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సందర్భంగా విడిగా ప్రధాని చేపట్టారు. సెయింట్ లూసియా ప్రధాని అలెన్ ఛేస్టెనెట్ ప్రస్తుత ‘కారికోమ్’( కరేబియన్ కమ్యూనిటీ) సమావేశానికి కో-ఛైయిర్‌గా వ్యవహరించారు. ఈ సమావేశానికి ఆంటిగ్వా, బర్బుడా, బార్బోడస్, డొమినికా, జమైకా, సెయింట్ కిట్స్, నెవిస్, సెయిట్ టూసియా, సెయింట్ విన్సెంట్ ట్రెనడైన్స్, ట్రినిడాడ్, టొబాగో దేశాల అధిపతులు హాజరయ్యారు. అంతేకాదు సురినామా వైజ్‌ప్రెసిడెంట్, బహమాస్, బెలిజె, గ్రెనడా, హైతీ, గుయానా దేశాల విదేశాంగ మంత్రులు హాజరయ్యారు. 

ప్రధాని నరేంద్రమోదీ తొలిసారి కారికోమ్ నాయకులను కలిశారు. ప్రాంతీయ అంశాల దృష్టిలో ఈ సమావేశం జరిగింది. కరేబియా, భారత్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు కూడా సుస్థిరంగా వృద్ధిచెందుతాయనే అంశం కూడా సమావేశంలో కీలకంగా చోటుచేసుకుంది. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను ‘కారికోమ్’ దేశాలతో బలోపేతం చేసుకోవడానికి భారత్ ఎంతో నిబద్ధతతో ఉంది. ఆ దేశాలతో ఎంతో శక్తివంతమైన భారత పౌరులు నివసిస్తున్నారు. ఇది కూడా కరేబియన్ దేశాలతో సంబంధాలు పటిష్టం చేసుకోవడానికి ఎంతగానో సహకరిస్తుంది. 

రాజకీయ, వ్యవస్థాగత  క్రమాన్ని బలోపేతం చేయడంపై సంభాషణలు కొనసాగాయి. అలాగే ఆర్థిక పెరుగుదల పరంగా సహకారం, వాణిజ్య పెంపుదల, పెట్టుబడులు, ఇరు దేశాల ప్రజల మధ్య పటిష్టమైన సంబంధాల పెంపుదల అంశాలు కూడా చోటుచేసుకున్నాయి. భారత ప్రధాని ‘కారికోమ్’ దేశాలతో భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు నొక్కిచెప్పారు. ముఖ్యంగా సామర్థ్య పెంపుదల, అభివృద్ధి సహాయం, ప్రకృతి వైపరిత్యాలు, సుస్థిరతల పరంగా సహకారం ఇచ్చిపుచ్చుకోవడం వంటి వాటి గురించి ప్రధాని నొక్కిచెప్పారు. భారత్ బహమాస్‌లో హరికేన్ డొరియన్ సంభవించినపుడు ఒక మిలియన్ అమెరికన్ డాలర్ల నిధిని  సహాయంగా ఆ దేశానికి భారత్ అందించింది.  

‘కారోమ్’లో చేపట్టిన 14 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన అభివృద్ధి ప్రాజక్టులను భారత్ ప్రకటించింది. అంతేకాదు మరో 150 మిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్‌ని సోలార్, పునరుత్పత్తి ఎనర్జీ, వాతావరణమార్పులకు సంబంధించిన ప్రాజక్టులకు ప్రకటించింది. ప్రధాని ఈ సందర్భంగా రీజనల్ సెంటర్ ఫర్ ఎక్సెలెన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని జార్జిటౌన్ గుయానాలో ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా బెలిజైలో ఉన్న రీజనల్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌ని మరింత మెరుగుపరిచేందుకు కూడా సహాయాన్ని భారత్ అందిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ ప్రతిపాదించిన కార్యక్రమాలను కారికోమ్ నాయకులు ఆహ్వానించారు. రెండు వైపులా సంబంధాల పటిష్టతకు అవి సంసిద్ధతను వ్యక్తంచేశాయి. తమ ప్రభుత్వాల నుంచి ఈ దిశగా సహకారాన్ని అందిచనున్నట్టు ఆ దేశ నాయకులు వెల్లడించారు. 

భారత-ఫసిఫిక్ దీవుల అభివృద్ధి దేశాలు (ఫిసిఐడిఎస్) నాయకుల సమావేశం కూడా 74వ యుఎన్‌జిఎ సమావేశ సమయంలో జరిగింది. ఈ సమావేశానికి ఫిజి, రిపబ్లిక్ ఆఫ్ కిరిబతి, రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ ఐలెండ్స్, ఫెడెరేటెడ్ స్టోరీస్ ఆఫ్ మైకోనెసియా, రిపబ్లిక్ ఆఫ్ నారు, రిపబ్లిక్ ఆఫ్ పలలు, ఇండిపెండెంట్ స్టేట్ ఆఫ్ పాపువా న్యూ గునియా, ది ఇండిపెండెంట్ స్టేట్ ఆఫ్ సమో, సోలోమోన్ ఐలండ్స, కింగ్డమ్ ఆఫ్ టోంగా, తువలు, రిపబ్లిక్ ఆఫ్ వనుతు దేశాల నాయకులు హాజరయ్యారు.   

ఫసిఫిక్ ఐలెండ్ దేశాలతో భారత సంబంధాలు ఎంతో చిక్కనైనవి. ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ తో ఈ సంబంధాలు మరింత అభివృద్ధి చెందాయి. దీని ఫలితంగానే యాక్షన్ ఓరియంటెడ్ ఫోరమ్ ఫర్ ఇండియా-ఫసిఫిక్ ఐలెండ్ కో-ఆపరేషన్ (ఎఫ్ఐపిఐసి) ఏర్పడింది. మొదటి, రెండవ సమావేశాలు ఫిజి (2015), జైపూర్(2016)లలో జరిగాయి. ఈ శిఖరాగ్ర సమావేశాలలో ప్రధాని ఫసిఫిక్ ఐలెండ్ నేషన్స్‌ తో సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నట్టు వెల్లడించారు. తమ అభివృద్ధి ప్రాజెక్టుల ఎజెండాను ముందుకు తీసుకువెళ్లడానికి వాటితో సన్నిహితంగా పనిచేయాలనుకుంటున్నట్టు  తెలిపారు. 

ఈ నాయకులు విస్తృత అంశాలపై ప్రసంగించారు. వాటిల్లో ఎస్‌డిజిఎస్ సాధనకు సంబంధించి అభివృద్ధి అనుభవాలు, పునరుత్పత్తి ఎనర్జీ పరంగా సహకార పెంపుదల, ప్రకృతి వైపరిత్యాలను నియంత్రించే కొత్తగా ఏర్పాటుచేసిన మౌలిక సదుపాయాల సంకీర్ణ ప్రయోగంలో పాలుపంచుకోవడం, ఇండియా-యుఎన్ అభివృద్ధి భాగస్వామ్య ఫండ్ కింద  సామర్థ్య పెంపుదల,, ప్రాజక్టుల అమలు, దాంతోపాటు భవిష్యత్తులో ఇండియా-పిఎస్ఐడి సహకారానికి రోడ్ మ్యాంప్ ఇవన్నీ కూడా నాయకుల ప్రసంగంలో చర్చించారు. 

ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్, పిఎస్ఐడిఎస్‌లు విలువలతో కూడిన భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలనుకుంటున్నాయన్నారు. అలాంటి భవిష్యత్తును పంచుకోవాలని కోరుకుంటున్నాయని స్పష్టంచేశారు. అభివృద్ధి విధానాల అవసరాన్ని కూడా అంతర్భాగం చేయాలని కూడా మోదీ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. తద్వారా సుస్థిరతను నెలకొల్పే అసమానతలను తగ్గించే, సాధికారతను కల్పించే, ప్రజలు నాణ్యమైన జీవితాలను అనుభవించేలా ఉండాలని కూడా ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పుల పరంగా భారత్ కూడా అన్ని దేశాలతో సమంగా కట్టుబడి వ్యవహరిస్తుందన్నారు. అభివృద్ధి లక్షాల సాధన పరంగా పిఎస్ఐడి కృషికి మద్దతు పలికారు. వీటిని  అభివృద్ధికరమైన, సాంకేతిక సహాయంతో కూడిన మార్గాల ద్వారా అవసరమైతే సాధించాలన్నారు. 

వాతావరణ మార్పులను ఈ సందర్భంగా మోదీ నొక్కి చెప్పారు. పునరుత్పత్తి ఎనర్జీని పంచుకోవాల్సిన అవసరాన్ని ఆయన పదే పదే ప్రస్తావించారు. తద్వారా వాతావరణ మార్పులలో సంభవించే దుష్టపరిణామాలను ఎదుర్కోవచ్చు. ఈ ప్రాంతంలోని ఎన్నో దేశాలు ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్‌లో చేరడాన్ని ఈ సదర్భంగా మోదీ ఆహ్వానించారు. మిగతా దేశాలను కూడా ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పిఎస్ఐడిఎస్ నాయకులను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఈ సంకీర్ణ కూటమిలోకి ఆహ్వానించారు. డిజాస్టర్ రీశాలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సిడిఆర్ఐ)సంకీర్ణంలో పాలుపంచుకోవాలని పిఎస్ఐడిఎస్ నాయకులను  ప్రధాని కోరారు. 

ఈ ప్రాంతంలోని దేశాల ప్రాధాన్యాల కనుగుణంగా అత్యున్నత ప్రభావం చూపే అభివృద్ధి ప్రాజక్టుల అమలు కోసం 12 మిలియన్ అమెరికన్ డాలర్లను భారత్ కేటాయించింది.